విశాల్ ఈ పేరంటే ముందుగా గుర్తుకు వచ్చేది అతను తెలుగువాడన్న విషయం.. అసిస్టెంట్ డైరెక్టర్ గా సినిమా కెరీర్ ను ప్రారంభించి.. తెలుగు, తమిళ భాషల్లో హీరోగా నిలదొక్కుకున్నాడు. ఇటీవల వరుస విజయాలతో మాంచి ఊపుమీదున్న విశాల్.. ప్రస్తుతం తన నాన్న కోరికను తీర్చే పనిలో పడ్డాడు. స్వతహాగా తెలుగువాడైన విశాల్ తమిళంలో హీరోగా నిలదొక్కుకున్నాడు. అక్కడ నటించిన ప్రతి సినిమాను ఇక్కడ కూడా రిలీజ్ చేస్తూ తెలుగు ప్రేక్షకులకు చేరువ అవుతున్నాడు. అయితే విశాల్ తండ్రి కృష్ణారెడ్డికి చాలా ఏళ్లుగా ఓ కోరిక ఉండేదట.. ఎప్పటికైనా తన కొడుకు విశాల్ చేత డైరెక్ట్ తెలుగు సినిమా తీయాలని.. అయితే విశాల్ మాత్రం ఈ విషయాన్నీ ప్రతిసారి వాయిదా వేస్తూ వస్తున్నాడు.
కానీ వచ్చే ఏడాది ఎట్టి పరిస్థితుల్లోను డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించాలని విశాల్ అనుకుంటున్నాడట.. ఇప్పటికే కొందరు టాలీవుడ్ డైరెక్టర్లతో సంప్రదింపులు కూడా చేశాడట.. అయితే ఇలా ప్రతి ఏటా అనుకుంటున్నాడే కానీ ముందుకెళ్లడం లేదన్న భావనలో కృష్ణారెడ్డి ఉన్నాడట.. ఏది ఏమైనా వచ్చే ఏడాది కల్లా తెలుగులో సినిమా ఉండాలి.. అవసరమైతే తమిళంలో ఇచ్చిన కమిట్మెంట్లను రద్దు చేసుకోవాలని విశాల్ కు సూచించాడట.. ఇక నాన్న సీరియస్ వార్ణింగ్ ఇచ్చేసరికి విశాల్ కూడా భారీ ప్రాజెక్ట్ కోసం రెడీ అయ్యాడట.. రెండు మూడు నెలల్లో మంచి కధ చూసుకుని సెట్స్ పైకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఇది ఎంతవరకు ముందుకు సాగుతుందో భవిశ్యత్ లో చూడాలి.