మైనర్ బాలికకు వివాహం చేసే ప్రయత్నం

Update: 2018-10-02 13:21 GMT

కృష్ణా జిల్లాలో మైనర్ బాలికకు వివాహం చేసే ప్రయత్నం చేశారు కుటుంబసభ్యులు. దాంతో సమాచారం అందుకున్న ICDS ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఆ బాలిక 9వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు తనకు పెళ్లి చేస్తున్నారు.. తనకు చదువుకోవాలని ఉందంటూ.. బాలిక ICDS కు విన్నవించుకుంది. వెంటనే రంగంలోకి దిగిన ప్రతినిధులు. అమ్మాయి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే విషయం బయటకు తెలియడంతో..   కుటుంబసభ్యులు ఆ పుత్తడిబొమ్మను పిన్ని ఇంటికి పంపించి మరీ నోరు మూయించే ప్రయత్నం చేశారు. చివరకు సదరు  బాలిక మీడియాను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News