ఉద్యమనాయకుడిగా ఉండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ పేరుమీద తెలంగాణ జనసమితి పార్టీని స్థాపించారు కోదండరాం. ఈ క్రమంలో ప్రత్యక్షరాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటికే మహాకూటమితో జతకట్టిన అయన కూటమి తరపున 12 సీట్లు అడుగుతున్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం 8 సీట్లతో సరిపెట్టింది. ఇదిలావుంటే కోదండరాం వరంగల్ జిల్లా జనగామ నుంచి పోటీకి రెడీ అయినట్టు తెలుస్తోంది. ఆయన కోసం స్థానికంగా కార్యలయం కూడా సిద్ధమైంది. నామినేషన్ వేశాక.. అక్కడి నుంచే కోదండరామ్ ప్రచారం మొదలుపెట్టబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అటు, పొన్నాలను కాదని జనగామ సీటు కోదండరామ్‌కు కేటాయించడం వెనుక పెద్ద లాబీయింగే నడిచింది. ఢిల్లీ పర్యటన సందర్భంగా జనగామపై రాహుల్‌తో చర్చించారు కోదండరామ్. ఆయన హామీ మేరకే పొన్నాల లక్ష్మయ్యను కాదని సీటు కోదండరామ్‌కు ఇస్తున్నారు. ఈ క్రమంలో తనకు న్యాయం చెయ్యాలని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల ఢిల్లీ బాట పట్టారు.