హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. ఈ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వ్యక్తిగత పనులు, ఆఫీసులకు వెళ్లే వారు తడిసి ముద్దయ్యారు. రోడ్లపైకి వర్షం నీరు భారీగా చేరడంతో వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కారణంగా కొన్ని ప్రదేశాలలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు భారీ వర్షంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. డిజాస్టర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు రంగంలోకి దిగాయి.
రక్షణకోసం 100 డయల్ చెయ్యాలని వారు తెలిపారు. పాత భవనాలను ఖాళీ చేయాలని, లోతట్టు ప్రాంతల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.