అన్నగారి అఖండ చైతన్య రథానికి,
రథసారథిగా వేలితివా ఓ హరన్న,
నీవు ఇక లేవన్న నిజం మాత్రం,
ఒక ఆలోచన అయిన అది గరళమన్న,
జీవితమనే ఇక్కడి ప్రయాణాన్ని,
ఇలా ముగించితివా నేడు ఓ హరన్న,
ఆ హరి నీ ఆత్మకి శాంతి అందించాలని,
అశ్రునయనాలతో నీ తెలుగు అభిమాని.
నందమూరి కుటుంబంలో ఆక్సిడెంట్ రూపంలో మరో విషాదం చోటుచేసుకుంది. సినీ నటుడు, టీడీపీ పోలీట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ (61) బుధవారం తెల్లవారు జామున నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. నెల్లూరు జిల్లాలో తన అభిమాని మోహన్ కుమారుడి పెళ్లికి వెళ్లేందుకు ఆయన హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరారు. కారును ఆయనే నడుపుతున్నారు. కారు అనే్నపర్తి వద్ద డివైడర్‌ను ఢీకొని వేగంగా పల్టీ కొట్టింది. ఆ సమయంలో కారు మరో వాహనాన్ని ఢీకొన్నది. కారు డోర్ తెరుచుకోవంటంతో పాటు ఆయన సీటు బెల్ట్ ధరించకపోవటంతో హరికృష్ణ కారులో నుంచి బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆయనను వెనువెంటనే స్థానికులు కామినేని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అన్నివిధాలుగా ప్రయత్నించినప్పటికీ తనని కాపాడలేక పోయారు. ఈ వార్త ఎంతోమంది నందమూరి అభిమానులని షాక్కి గురి చేసింది.