హోంగార్డుల దినసరి వేతనం మూడు వందల నుంచి ఆరు వందల రూపాయలకు పెంచుతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. హోంగార్డుల మెటర్నిటీ సెలవులను మూడు నెలలకు పెంచుతునట్లు తెలిపారు. అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసి హోంగార్డులు తమ సమస్యలను చెప్పుకున్నారు. ఇందుకు స్పందించిన ముఖ్యమంత్రి.. వెంటనే పలు నిర్ణయాలను ప్రకటించారు. హోంగార్డులకు జీతం పెంపుతో పాటు..రెండున్నర లక్షల రూపాయల వైద్య సేవలు అందిస్తామన్నారు. గృహనిర్మాణ పథకంలో హోంగార్డులకు ఇళ్ల కేటాయింపు విషయం పరిశీలించాలని సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.