తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరావు సొంత నియోజకవర్గం గజ్వేల్ లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముఖ్యనేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందులో ముఖ్యంగా జగదేవ్‌పూర్ ఎంపీపీ రేణుకతోపాటు ఇద్దరు ఎంపీటీసీలు, ఇద్దరు సర్పంచ్‌లు, ఇద్దరు కౌన్సిలర్లు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేణుకతోపాటు ఎంపీటీసీలు మమతాభాను, కవితా యాదగిరి, కౌన్సిలర్ భాగ్యలక్ష్మి దుర్గాప్రసాద్ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. తొమ్మిది నెలలు ముందగానే ప్రభత్వాన్ని రద్దుచేసి ఎన్నికలకు వెళుతున్న కేసీఆర్ కు ఇది గట్టి ఎదురుదెబ్బే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలావుంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్హౌస్ జగదేవ్‌పూర్ ఎంపీపీ సెగ్మెంట్ లోనే ఉండగా.. ఎంపిపి రేణుక కాంగ్రెస్ లో చేరడంతో స్థానిక టిఆర్ఎస్ క్యాడర్ షాక్ లో మునిగిపోయింది.