ఆస్ట్రేలియా క్రికెటర్ల బాల్ టాంపరింగ్ వివాదం ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ కామెరూన్ బాన్‌క్రాప్ట్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడి అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఇందులో అసలు దోషులు ఎవరో తెలుసుకునేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా బృందంలోని క్రికెట్ ఆస్ట్రేలియా హెడ్ ఆఫ్ ఇంటెగ్రిటీ లైన్ రాయ్, హై ఫెర్ఫార్మెన్స్ మేనేజర్ పాట్ హోవార్డ్‌లు కేప్ టౌన్ వేదిక గా విచారణ చేపట్టారు.
ఇదిలా ఉంటే టాంపరింగ్ వివాదంపై ఆస్ట్రేలియా మీడియా కథనాల్ని ప్రసారం చేసింది. టాంపరింగ్ మాస్టర్ మైండ్ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అని తేల్చి చెప్పింది. అంతేకాదు బాల్ టాంపరింగ్ వివాదంలో ప్రధాన పాత్రదారులైన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌పై ఏడాది నిషేధం దాదాపుగా ఖరారైటర్లు సమాచారం.
తొలత టాంపరింగ్ చేయాలని దురుద్దేశం వచ్చింది డేవిడ్ వార్నర్ అని, వార్నర్ టాంపరింగ్ ఎప్పుడు ఎలా చేయాలో ఓపెనర్ బాన్ క్రాప్ట్ కు సూచనలిచ్చాడట. ఆ తరువాత తన పథకాన్ని స్మిత్‌కు చెప్పగా అతను కూడా గుడ్డిగా ఒప్పుకున్నాడని, కానీ ఆటగాళ్లందరూ అంగీకరించరు అని కెప్టెన్ స్మిత్ అన్నాడట. స్మిత్ ఆమోదంతో వార్నర్ సూత్రధారిగా.. బాన్‌క్రాఫ్ట్ పాత్రధారిగా టాంపరింగ్‌కు తెరలేచినట్టు తెలుస్తోంది. అనుకున్న పథకం ప్రకారం కేప్ టౌన్ వేదికగా మూడు టెస్ట్ లో డేవిడ్ వార్నర్ చేతినిండా టేప్ చుట్టుకున్నాడు. బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ ను ఆ టేప్ సాయం తో బంతి ఆకారాన్ని మార్చాడు. ఇది గమనించిన సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ అంపైర్ కు ఫిర్యాదు చేశారు. దీన్ని అంపైర్లు అంతగా పట్టించుకోలేదు.
ఎప్పుడైతే సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ అంపైర్ కు ఫిర్యాదు చేశారో..ఆ విషయం అంతా సూపర్‌స్పోర్ట్ నెట్‌వర్క్ ఛానెల్ లో రికార్డ్ అయ్యింది. అప్పటి నుండి కంగారుల బౌలింగ్ పై దృష్టిసారించారు. బౌలర్ బాల్ విసిరినప్పటి నుంచీ తిరిగి అతని చేతికి వచ్చే వరకు కెమెరాల సాయంతో క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టారు.
అదే సమయంలో బౌలర్ బెనక్రాప్ట్ తన దగ్గర ఉన్న టేప్ తో బంతి ఆకారాన్ని మార్చుతుండగా .. ఆ న్నివేశాలను టీవీలో చూపించడంతో కోచ్ డారెన్ లెహమాన్ అప్రమత్తమై డగౌట్‌లో ఉన్న ఆటగాళ్లతో వాకీటాకీలో వారితో మాట్లాడాడు.
నిజనిర్ధారణ కోసం సూపర్‌స్పోర్ట్ నెట్‌వర్క్ ఛానెల్ కెమెరామెన్ జోటని ఆస్కార్ తో సంప్రదింపులు జరిపింది. ఇక, ఆసీస్ బౌలర్లు 30 ఓవర్లలోపే బంతిని రివర్స్ స్వింగ్ చేయడాన్ని చూసి ఆశ్చర్యపోయిన ఆస్కార్ ఇదే విషయాన్ని సూపర్‌స్పోర్ట్ నెట్‌వర్క్ కు చెప్పాడు.
దక్షిణాఫ్రికాలో పచ్చిక ఉన్న పిచ్‌లపై బంతి ఆకారం అంత త్వరగా మారిపోవడం అసాధ్యమని, కానీ 30 ఓవర్లలోపే ఆసీస్ బౌలర్లు రివర్స్ స్వింగ్ చేయడంతో వాళ్లు కచ్చితంగా ఏదో చేస్తున్నారన్న అనుమానం కలిగిందని తెలిపాడు. గంటన్నరపాటు బంతి ఎవరెవరి చేతుల్లోకి వెళ్తున్నదో జాగ్రత్తగా గమనించాలని సూచించింది. అప్పుడే ఈ టాంపరింగ్ వివాదం వెలుగులోకి వచ్చింది.