బాల్ టాంప‌రింగ్ అంటే ..? టాంప‌రింగ్ లో ముగ్గురు క్రికెట‌ర్లు

Update: 2018-03-28 06:12 GMT

స్టీవ్ స్మిత్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ఆసీస్‌ సంస్కృతిని దెబ్బతీసిందని మాజీ కెప్టెన్ స్టీవ్ వా ఆవేదన వ్యక్తం చేశాడు. కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ కామెరూన్ బాన్‌క్రాప్ట్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడి అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే.  
కేప్‌టౌన్‌ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు మూడో రోజు  ఆస్ట్రేలియా క్రికెటర్ కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డాడు. తన ప్యాంట్ జేబులోంచి పసుపు రంగు పదార్థంతో బంతి ఆకారాన్ని మార్చే ప్రయత్నం చేశాడు. ఇది కెమెరాల కంటికి చిక్కడంతో అడ్డంగా బుక్కయ్యాడు. మ్యాచ్ ముగిసిన త‌రువాత ట్యాంప‌రింగ్ పై స్పందించిన కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ మాట్లాడుతూ సీనియర్‌ ఆటగాళ్లందరం కలిసే ఈ మోసానికి పాల్పడ్డామని అన్నాడు.
బాల్ టాంపరింగ్ వల్ల బంతి స్వరూపం మారిపోతుంది. కొత్త బంతిని రివర్స్ స్వింగ్ కష్టం. అదే బంతి స్వరూపాన్ని మారిస్తే అది రివర్స్ స్వింగ్ చేసేందుకు అనువుగా ఉంటుంది. తద్వారా ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌ను తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేర్చొచ్చు. ఇందులో భాగంగానే కెప్టెన్ స్మిత్, బాన్‌క్రాఫ్ట్ ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం బంతి స్వరూపాన్ని మార్చే ప్రయత్నం చేశారు. కాబట్టే ఆస్ట్రేలియా ఆట‌గాళ్లు టాంపరింగ్ కు పాల్ప‌డ్డారు. దీంతో ఆట‌గాళ్ల‌పై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించింది. బాల్ టాంప‌రింగ్ ఎవ‌రు పాల్ప‌డ్డారు. భాగ‌స్వాములు ఎవ‌రు అనే విష‌యంపై విచార‌ణ చేప‌ట్టింది. ఈ విచార‌ణ‌లో హోట‌ల్ సిబ్బంది, స‌హ‌చ‌ర ఆట‌గాళ్లు, కోచ్ లీమ‌న్ , స‌హాయ‌క సిబ్బందిని విచారించారించింది. అయితే టాంపరింగ్ వివాదంలో కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌, ఓపెనర్‌ బాన్‌క్రాఫ్ట్‌‌లకు మాత్ర‌మే ప్ర‌మేయం ఉంద‌ని అన్నారు. 
మిగతా ఆటగాళ్ల ప్రమేయం ఏమాత్రం లేదని, వారంతా అమాయకులేనని సీఏ సీఈవో జేమ్స్‌ సదర్లాండ్‌ ప్రకటించారు.  కేప్‌టౌన్‌లో విచారణ జరిపిన క్రికెట్‌ ఆస్ట్రేలియా హెడ్‌ ఆఫ్‌ ఇంటెగ్రిటీ లైన్‌ రాయ్, హై ఫెర్ఫార్మెన్స్‌ మేనేజర్‌ పాట్‌ హోవార్డ్‌లు బోర్డుకు అందించిన నివేదిక ఆధారంగా స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌పై చర్యలు తీసుకోనున్నారు. 
బాల్ టాంపరింగ్‌ వివాదం మా దేశ ప్రతిష్టను దిగజార్చింది. ఈ విషయంలో నేను క్షమాపణలు చెబుతున్నాను జేమ్స్ స‌ద‌ర్లాండ్ అన్నారు.  మరోవైపు ముగ్గురు ఆటగాళ్లపై విధించే శిక్షపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. 

Similar News