ఉత్తరప్రదేశ్ లక్నోలో దారుణం జరిగింది. ప్రముఖ కంపెనీకి చెందిన ఓ ఉన్నతాధికారిని పోలీసులు కాల్చిచంపారు. యాపిల్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న వివేక్‌తివారీ(38) శుక్రవారం అర్ధరాత్రి విధులు ముగించుకుని మరో సహోద్యోగితో కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. సెక్యూరిటీ చెకప్ నిమిత్తం ముకదమ్‌పూర్ వద్ద కారును ఆపాల్సిందిగా ఇద్దరు పోలీసులు అతనికి సూచించారు. అయితే వివేక్ కారును ఆపలేదు పైగా పోలీసులనుపట్టించుకోకుండా వెళ్లడంతో ఆ కారును ఓవర్‌టేక్ చేసిన కానిస్టేబుల్ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వివేక్ ఎడమచెవి కింద బుల్లెట్ దూసుకుపోవడంతో కారు డివైడర్‌ను ఢీకొంది. అపస్మారకస్థితిలో పడివున్న వివేక్‌ను లోహియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతడిపై కాల్పులు జరిపింది తన ఆత్మ రక్షణ కోసమేనని చెప్పాడు. వేగంగా వెళుతున్న అతడి కారు ఒకచోట లైట్లు ఆర్పేసి అనుమానాస్పదంగా ఆగి ఉండటాన్ని చూశా. నేను దగ్గరకు వెళ్లగానే వివేక్ ఒక్కసారిగా కారును నామీద నుంచి పోనిచ్చేందుకు యత్నించాడు. 3సార్లు ఇలా యత్నించాడు. దీంతో నా ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపాను అని వెల్లడించాడు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపారు.