సిప్‌లో ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరులు.. అయితే ఎంత కాలం.. ఎంత డబ్బు..!
SIP Calculation: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ లక్షాధికారి కావాలని కలలు కంటారు.
SIP Calculation: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ లక్షాధికారి కావాలని కలలు కంటారు. నిజానికి దేశ, విదేశాల్లో కోటీశ్వరుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం సాధారణ పెట్టుబడి ద్వారా కోటీశ్వరులుగా మారవచ్చు. అయితే దీని కోసం ఓపిక అవసరం. అంతేకాదు స్థిరమైన పెట్టుబడిని కొనసాగించాలి. సాధారణ ఆదాయాన్ని సంపాదించేవారు నిర్దిష్ట కాలంలో కోటీశ్వరులు కావాలనుకుంటే మ్యూచ్‌ఫల్ ఫండ్స్ SIP ద్వారా కావొచ్చు. అయితే అది ఏ విధంగా అనేది తెలుసుకుందాం.
5 సంవత్సరాలలో కోటీశ్వరులు
SIP ద్వారా 5 సంవత్సరాలలో కోటీశ్వరులుగా మారవచ్చు. అయితే మీరు లక్షలు సంపాదించే వ్యక్తి అయి ఉండాలి. రిటర్న్ కాలిక్యులేటర్‌ను పరిశీలిస్తే మీరు ప్రతి నెలా రూ.1 లక్ష పెట్టుబడి పెడితే కేవలం 20 శాతం వార్షిక రాబడితో మీ పెట్టుబడి విలువ 5 సంవత్సరాల తర్వాత కోటి స్థాయిని దాటుతుంది.
10 సంవత్సరాలలో కోటీశ్వరులు
10 సంవత్సరాలలో కోటీశ్వరులు కావాలంటే నెలకి రూ.50000 సిప్ చేయాలి. 10 సంవత్సరాల తర్వాత సగటున 12 శాతం రాబడితో 1.03 కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో 12 శాతం రాబడి సాధారణం. ఈ లెక్కన, మీరు మొత్తం 60 లక్షల పెట్టుబడిపై 43 లక్షలు సంపాదించగలరు.
15 ఏళ్లలో కోటీశ్వరులు
15 ఏళ్లలో కోటీశ్వరులు కావాలనుకుంటే సగటున 12 శాతం రాబడితో నెలకు 20 వేల రూపాయల SIPతో మిలియనీర్ కావచ్చు. మీరు పెట్టుబడి పెట్టిన 36 లక్షలకు దాదాపు 65 లక్షల లాభం పొందుతారు.
20 ఏళ్లలో కోటీశ్వరులు
20 సంవత్సరాలలో కోటీశ్వరులు కావాలంటే సగటున 12 శాతం రాబడితో నెలకు రూ.10100 చెల్లించాలి. అప్పుడు రూ.1 కోటి సంపాదించవచ్చు. ఇందులో మీరు రూ.76 లక్షల కంటే ఎక్కువ రిటర్న్ పొందుతారు.
25 సంవత్సరాలలో కోటీశ్వరులు
25 సంవత్సరాలు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటే కోటీశ్వరులు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. వాస్తవానికి ఈ కాలానికి నెలకు రూ.8000తో కేవలం 10 శాతం రాబడితో రూ.1.07 కోట్లు సంపాదిస్తారు.