Petrol and Diesel Price: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న చమురు మంటలు

Petrol and Diesel Price: ఇండియాలో ఇంధన ధరలు ఇవాళ మరోసారి పెరిగాయి.

Update: 2021-06-16 06:08 GMT

ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా

Petrol and Diesel Price: ఇండియాలో ఇంధన ధరలు ఇవాళ మరోసారి పెరిగాయి. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉన్న సమయంలోనూ ఈ ఏడాది పలుమార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వాహనదారుల జేబులు గుల్ల అవుతున్నాయి. ఓవైపు నిత్యావసర సరుకుల ధరలు మండిపోతుంటే మరోవైపు ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

తాజాగా పెట్రోల్‌పై 25 పైసలు పెరగగా, డీజిల్ ధర 13 పైసల మేర పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని వాహనదారులకు మరింత భారమైంది. హైదరాబాద్‌లో ఇవాళ 26 పైసలు పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయల 46 పైసలకు చేరుకుంది. నగరంలో ఇది ఆల్ టైమ్ గరిష్ట ధరగా రికార్డుకెక్కింది. ఇక డీజిల్ పై 14 పైసలు పెరగడంతో లీటర్ డీజిల్ ధర 95 రూపాయల 28 పైసలకు చేరింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర దాదాపు నూట మూడు రూపాయలకు చేరుకుంది. డీజిల్‌ ధర 97 రూపాయల 19పైసలుగా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఆల్ టైమ్ గరిష్టానికి పెట్రో ధరలు చేరుకున్నాయి. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్ ధర 96వేల 66 పైసలు, డీజిల్ ధర 87వేల 28పైసలుగా ఉంది. ఇక.. ముంబైలో లీటర్‌ పెట్రోల్ ధర నూట రెండు రూపాయల 82 పైసలు కాగా.. డీజిల్ ధర 94 రూపాయల 84 పైసలకు చేరింది. చెన్నైలో లీటర్‌ పెట్రోల్ 97 రూపాయల 91 పైసలు, డీజిల్ ధర 92 రూపాయల 4 పైసలుగా ఉంది.

Tags:    

Similar News