Senior Citizen: సీనియర్ సిటిజన్లకి గుడ్‌న్యూస్.. ఈ సంస్థ వడ్డీరేట్లని పెంచింది..!
Senior Citizen: సీనియర్ సిటిజన్లకి గుడ్‌న్యూస్.. ఈ సంస్థ వడ్డీరేట్లని పెంచింది..!
Senior Citizen: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల రెపో రేటును పెంచిన తర్వాత ఫిక్స్‌డ్ డిపాజిట్లు మరింత ఆకర్షణీయంగా మారాయి. అనేక ప్రభుత్వ , ప్రైవేట్ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. తద్వారా కస్టమర్‌లు తమ డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లను పొందుతున్నారు. వాస్తవానికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు పెట్టుబడికి సురక్షితమైన ఎంపిక. అధిక ద్రవ్యోల్బణం, స్టాక్ మార్కెట్‌లో ఒడిదుడుకుల మధ్య చాలా మంది ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఎంచుకుంటారు. మీరు బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, పోస్టాఫీసుల నుంచి తక్కువ రిస్క్ ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.
తమిళనాడు పవర్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై చాలా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 8.5 శాతం వడ్డీని ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం పెట్టుబడిదారుల అవసరాలకు అనుగుణంగా రెండు ఎంపికలను ప్రవేశపెట్టింది. ఒకటి నాన్-క్యుములేటివ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ రెండోది మరొకటి క్యుములేటివ్ ఫిక్స్‌డ్ డిపాజిట్.
నాన్ క్యుములేటివ్ ఫిక్స్‌డ్ డిపాజిట్
ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ కింద పెట్టుబడిదారులు నెలవారీ, త్రైమాసిక, వార్షిక వడ్డీని పొందవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్ మెచ్యూర్ అయినప్పుడు వారు తమ పెట్టుబడిని విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ 2, 3, 4, 5 సంవత్సరాల కాలవ్యవధిలో ఉంటుంది. సీనియర్ సిటిజన్లు కానివారికి దీనిపై వడ్డీ రేట్లు 7.25 శాతం నుంచి 8 శాతం మధ్య ఉంటాయి. అదే సమయంలో, సీనియర్ సిటిజన్లకు 8.5 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది.
క్యుములేటివ్ ఫిక్స్‌డ్ డిపాజిట్
ఇందులో వడ్డీ రేటు త్రైమాసికానికి సమ్మేళనంచేస్తారు. ఇది మెచ్యూరిటీపై పెట్టుబడిదారులకు చెల్లిస్తారు. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ కాలపరిమితి కూడా 1, 2, 3, 4, 5 సంవత్సరాలు. కాల వ్యవధి ప్రకారం వడ్డీ రేటు 7.25 శాతం నుంచి 8.5 శాతం మధ్య నిర్ణయించారు. 58 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు 60 నెలల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 8.5 శాతం వడ్డీ రేటును చెల్లిస్తున్నారు.