Investment Plan: సూపర్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్.. సులువుగా రూ.కోటి సంపాదించే మార్గం..!
Investment Plan: మీరు ఇన్వెస్ట్‌మెంట్‌కు రెడీ అయితే మార్కెట్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ సరైన ఎంపిక మాత్రమే మీకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది.
Investment Plan: మీరు ఇన్వెస్ట్‌మెంట్‌కు రెడీ అయితే మార్కెట్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ సరైన ఎంపిక మాత్రమే మీకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. లేదంటే లాభాలకు బదులు నష్టాలు చవిచూడాల్సి ఉంటుంది. అందుకే ఎక్కడ, ఎంత ఇన్వెస్ట్ చేయాలో తెలిసి ఉండాలి. నెలకు రూ. 5000 ఆదా చేసి వాటిని పీపీఎఫ్, ఫిక్స్‌డ్ డిపాజిట్, మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసినట్లయితే రూ.1 కోటి సంపాదించవచ్చు. దాని ప్రాసెస్ గురించి ఈ రోజు తెలుసుకుందాం.
ఇన్వెస్ట్ చేసే ముందు కొన్ని విషయాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు మీరు ఏదైనా కంపెనీ షేర్లను కొనాలని అనుకుంటే ఆ కంపెనీ లాభాలను చూసి ఇన్వెస్ట్ చేయవద్దు. షార్ట్ టర్మ్ లో రిస్క్ ఎక్కువ కాబట్టి లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. అలాగే డబ్బు మొత్తాన్ని ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. రకరకాల పెట్టుబడి ఎంపికల్లో ఇన్వెస్ట్ చేయాలి. మంచి రాబడి పొందాలంటే ముందుగానే ఇన్వెస్ట్ చేయడం ముఖ్యం. ఎంత త్వరగా ఇన్వెస్ట్ చేస్తే రాబడులు అంత బలంగా ఉంటాయి.
మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్
మీరు ఏదైనా పెట్టుబడి మాధ్యమాన్ని ఎంచుకోవచ్చు. మీకు 20 ఏళ్లు ఉండి పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్, ఎఫ్డీలో నెలకు రూ. 5000 ఇన్వెస్ట్ చేస్తే రూ. 1 కోటి వరకు ఫండ్‌ను సృష్టించవచ్చు. సిప్ ద్వారా ప్రతి నెలా రూ.5,000 పెట్టుబడి పెట్టడం వల్ల భారీ ఫండ్‌ను క్రియేట్ చేయవచ్చు. ప్రతి నెలా రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే 10 ఏళ్లలో రూ.6 లక్షల పెట్టుబడి అవుతుంది. మీరు పదేళ్ల మెచ్యూరిటీపై రూ. 13.9 లక్షల వరకు 40 ఏళ్లలో రూ. 24 లక్షలపెట్టుబడిపై రూ. 15.5 కోట్ల వరకు రాబడిని పొందుతారు.