బిజినెస్ ప్రారంభిస్తున్నారా.. GST గురించి ఈ విషయాలు తెలుసా..?
GST: జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అన్ని వస్తువులు, సేవలకు జీఎస్టీ (వస్తువులు మరియు సేవల పన్ను) చెల్లించాల్సి ఉంటుంది.
GST: జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అన్ని వస్తువులు, సేవలకు జీఎస్టీ (వస్తువులు మరియు సేవల పన్ను) చెల్లించాల్సి ఉంటుంది. పెట్రోలు, డీజిల్‌తో సహా కొన్ని వస్తువులను జీఎస్టీ పరిధిలోకి రాకుండా ప్రభుత్వం ఉంచింది. GSTని వసూలు చేయడానికి కొన్ని నియమాలు, నిబంధనలు రూపొందించారు. వీటని పాటించడం చాలా ముఖ్యం. ఉదాహరణకు మీరు చిన్న వ్యాపారం చేస్తున్నారనుకోండి మీ వద్ద GST నంబర్ లేదు. అప్పుడు మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఎలాగో తెలుసుకుందాం.
GST ఎందుకు..
భారతదేశంలో వ్యాపారం చేస్తున్న చాలా మంది వ్యక్తులు GST నంబర్‌ను కలిగి ఉన్నారు. దాని కింద వారు GSTని సేకరించి ప్రభుత్వానికి జమ చేస్తారు. కానీ వ్యాపారానికి GST నంబర్ లేకపోతే మీరు GST నంబర్ ఉన్న వారి నుంచి వస్తువులను కొనుగోలు చేసినప్పుడు పన్ను చెల్లించాలి. కానీ మీరు అదే వస్తువులను ఇతర వ్యక్తికి విక్రయించినప్పుడు అతని నుంచి GST వసూలు చేయలేరు.
20 లక్షల వ్యాపారం ఉంటే GST నంబర్ తప్పనిసరి
మీరు వస్తువుల కొనుగోలు కోసం GST చెల్లిస్తున్నట్లయితే, వస్తువులు విక్రియించినప్పుడు కూడా విక్రయించడానికి GST వసూలు చేసుకోవాలి. అందుకోసం మీరు వ్యాపార GST నంబర్‌ను తప్పకుండా తీసుకోవాలి. సంవత్సరానికి 20 లక్షల టర్నోవర్ కంటే ఎక్కువ ఉంటే మీరు తప్పనిసరిగా GST నెంబర్ తీసుకోవాలి. లేదంటే మీపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. వస్తువులు, సేవలపై GSTలో రెండు సమాన భాగాలు ఉన్నాయి. ఇందులో కొంత భాగాన్ని కేంద్ర ప్రభుత్వం సేకరిస్తుంది దీనిని CGST (సెంట్రల్) అని పిలుస్తారు. ఇందులో రెండో భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుంది. దీనిని SGST (స్టేట్) అని పిలుస్తారు.