Cheating Customers: బంగారం కొనేందుకు వచ్చిన కస్టమర్లను మోసం చేస్తే దుకాణదారుడు జైలుకే..

*భారతదేశంలో బంగారానికి డిమాండ్‌ ఎక్కువ. ఏ చిన్న వేడుక అయినా కచ్చితంగా బంగారం ఉండాల్సిందే.

Update: 2021-11-24 07:03 GMT

బంగారం కొనేందుకు వచ్చిన కస్టమర్లను మోసం చేస్తే దుకాణదారుడు జైలుకే..

Cheating Customers: భారతదేశంలో బంగారానికి డిమాండ్‌ ఎక్కువ. ఏ చిన్న వేడుక అయినా కచ్చితంగా బంగారం ఉండాల్సిందే. భారతదేశంలో పేదవారి నుంచి ధనవంతుల దాక ఎంతోకొంత బంగారం కలిగి ఉంటారు. అయితే గతంలో బంగారం కొనడానికి వచ్చిన కస్టమర్లను దుకాణదారుడు బోల్తా కొట్టించేవాడు. నకిలీ బంగారం లేదా నాసిరకం బంగారం మెరుగైనదని చెప్పి అంటగట్టేవాడు. డబ్బులు దండిగా కొల్లగొట్టేవాడు. దీని గురించి అవగాహన లేని కొనుగోలుదారులు వారి చేతిలో మోసానికి గురయ్యేవారు. ప్రస్తుతం కాలం మారింది కాబట్టి ఇలాంటి మోసాలు చాలా తక్కువగా జరుగుతున్నాయి.

2019 నుంచి బంగారు ఆభరణాలపై వినియోగదారుల చట్టం వర్తిస్తుంది. ఎవరైనా దుకాణదారుడు కస్టమర్‌ని మోసం చేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. సాధారణంగా నగల దుకాణదారులు 18 క్యారెట్ల నగలు 22 క్యారెట్‌లుగా చూపి వినియోగదారులను మోసం చేసిన కేసులు చాలా ఉన్నాయి. అయితే చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఎవరైనా దుకాణదారుడు ఇలా చేస్తే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు జైలుపాలయ్యే అవకాశం ఉంది. వినియోగదారులకు జరిగే మోసాలను అరికట్టడానికి ప్రభుత్వం బంగారు ఆభరణాలను చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది. తద్వారా వినియోగదారులు సరైన బంగారం పొందుతారు.

మీడియా నివేదికల ప్రకారం.. బంగారంపై చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఒక దుకాణదారుడు ఆభరణాల కొనుగోలులో మోసానికి పాల్పడితే అతనికి లక్ష రూపాయల జరిమానా ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తారు. ఇది మాత్రమే కాదు జరిమానాతో పాటు వినియోగదారుని మోసం చేసే దుకాణదారుడు నగల ధరకు ఐదు రెట్లు చెల్లించాల్సి ఉంటుంది. బంగారు ఆభరణాలు కొనడానికి వెళ్లినప్పుడల్లా కచ్చితంగా హాల్‌మార్క్ ఉన్న ఆభరణాలను కొనాలి. ఇది స్వచ్ఛతకు గుర్తింపు. భవిష్యత్తులో ఎప్పుడు విక్రయించినా మంచి ధర పలుకుతుంది.

Tags:    

Similar News