సామాన్యుడికి షాకింగ్‌.. సబ్బులు, సర్ఫుల ధరలు పెరుగుదల..

* 100 గ్రాముల ఫియామా సబ్బు ప్యాక్‌ల ధరలను ఐటీసీ 10 శాతం పెంచింది. *100 గ్రాముల వివెల్ సబ్బు ప్యాక్ ధరను తొమ్మిది శాతం పెంచింది.

Update: 2021-11-27 15:00 GMT

సబ్బులు, సర్ఫుల ధరలు పెరుగుదల(ఫైల్ ఫోటో)

Rising Prices: సామాన్యుడికి మరో షాక్‌ తగిలింది. పెరిగిన ఇంధన ధరలు, గ్యాస్‌ ధరలతో పాటుగా ఇప్పుడు నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగాయి. తాజాగా సబ్బులు, డిటర్జెంట్ల ధరలు పెరిగాయి. వీల్ డిటర్జెంట్ పౌడర్, రిన్స్ బార్, లక్స్ సబ్బు ధరలను 3.4 శాతం నుంచి 21.7 శాతానికి పెంచారు.

అదే సమయంలో ఐటీసీ ఫియామా సబ్బు ధరను 10 శాతం, వివెల్ 9 శాతం, ఎంగేజ్ డిటర్జెంట్ ధరలను 7.6 శాతం పెంచింది. దేశంలోని రెండు అతిపెద్ద ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) కంపెనీలు ధరల పెరుగుదల వెనుక ఇన్‌పుట్ ఖర్చు పెరగడమే కారణమని పేర్కొన్నాయి.

1 కిలో వీల్ డిటర్జెంట్ ప్యాక్ ధరను 3.4 శాతం పెంచింది. దీంతో దీని ధర రూ.2 పెరగనుంది. దీని ధర ఇప్పుడు రూ.28 నుంచి రూ.30కి పెరిగింది.vలక్స్ సబ్బు ధర రూ. 25 పెరిగింది. 250 గ్రాముల రిన్ బార్ ప్యాక్ ధరను హెచ్‌యూఎల్ 5.8 శాతం పెంచినట్లు నివేదికలో పేర్కొంది. FMCG దిగ్గజం 100 గ్రాముల మల్టీప్యాక్ లక్స్ సబ్బు ధరను 21.7 శాతం లేదా రూ. 25 పెంచింది.

మరోవైపు 100 గ్రాముల ఫియామా సబ్బు ప్యాక్‌ల ధరలను ఐటీసీ 10 శాతం పెంచింది. 100 గ్రాముల వివెల్ సబ్బు ప్యాక్ ధరను తొమ్మిది శాతం పెంచింది. 150 ఎంఎల్ బాటిల్ ఎంగేజ్ డియోడరెంట్ ధరను 7.6 శాతం, 120 ఎంఎల్ బాటిల్ ఎంగేజ్ పెర్ఫ్యూమ్ ధరను 7.1 శాతం పెంచింది. ఇన్‌పుట్ కాస్ట్ ధరల్లో గణనీయమైన పెరుగుదల కారణంగా పరిశ్రమ ధరలను పెంచిందని తెలుస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసిన వస్తువుల ధరలను కంపెనీలు పెంచాయి.

Tags:    

Similar News