SBI: ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. 'హాయ్' చెప్పండి..
SBI Whatsapp Banking Services: నేటి ఆన్‌లైన్ యుగంలో బ్యాంకింగ్ రంగం కూడా మొబైల్‌పైనే ఆధారపడుతోంది.
SBI Whatsapp Banking Services: నేటి ఆన్‌లైన్ యుగంలో బ్యాంకింగ్ రంగం కూడా మొబైల్‌పైనే ఆధారపడుతోంది. ఏ లావాదేవీ అయినా (మనీ ట్రాన్స్‌ఫర్) అయినా ఇంట్లో కూర్చొని సులువుగా చేస్తున్నారు. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో సర్వీస్ ప్రారంభించింది. తొలిసారి వాట్సప్ బ్యాంకింగ్ సేవల్ని ప్రారంభించింది. ఇకపై ఖాతాదారులు బ్యాలెన్స్ విచారణ, మినీ స్టేట్‌మెంట్‌లను వాట్సాప్ ద్వారా పొందవచ్చు. వినియోగదారులు ఈ సేవలను ఎలా పొందాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
ఎస్‌బీఐ కస్టమర్లు వాట్సప్ బ్యాంకింగ్ సేవల్ని పొందాలనుకుంటే యూజర్లు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి WAREG అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి అకౌంట్ నెంబర్‌ను ఎంటర్ చేసి 7208933148 నంబరుకు మెసేజ్ చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్న తర్వాత వాట్సాప్‌లో నుంచి +91 9022690226కి Hi అని వాట్సాప్ మేసెజ్ చేయాలి. ఆ తర్వాత వచ్చే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. ఇలా చేయగానే చాట్ బాక్స్‌లో అకౌంట్ బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్, వాట్సాస్ బ్యాంకింగ్ సేవలు రద్దు అనే మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటిలో మీకు అవసరమైన ఆప్షన్‌ను ఎంచుకొని సదరు నెంబర్‌ను టైప్ చేసి ఎంటర్ చేయాలి.