SBI: మరో కొత్త స్కీం ప్రారంభించిన ఎస్బీఐ.. బంపర్ ప్రయోజనం..!
SBI: 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' వేడుకలు నిర్వహిస్తున్నారు.
SBI: 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక సందర్భంగా దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది. దీనిపేరు'ఉత్సవ్ డిపాజిట్'. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో మీరు బంపర్ ప్రయోజనం పొందవచ్చు. వడ్డీ రేటు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి కానీ ఇది పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని గురించి ట్వీట్ కూడా చేసింది.
ఈ పథకం ప్రత్యేకత ఏమిటి?
ఎస్బీఐ అందించిన సమాచారం ప్రకారం ఉత్సవ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీంలో ఎస్బీఐ 1,000 రోజుల డిపాజిట్లపై 6.10% వడ్డీ రేటును అందిస్తోంది. ఇందులో ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు సాధారణ రేటు కంటే 0.50% అదనపు వడ్డీ రేటును పొందవచ్చు. ఈ రేట్లు 15 ఆగస్టు 2022 నుంచి అమలులోకి వస్తాయి ప్లాన్ 75 రోజుల పాటు చెల్లుబాటులో ఉంటుంది.
వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ
కొద్ది రోజుల క్రితం ఎస్బీఐ రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. కొత్త వడ్డీ రేట్లను ఆగస్ట్ 13, 2022న ప్రకటించింది. అలాగే ఆగస్టు 15వ తేదీ నుంచి రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బెస్ట్ లెండింగ్ రేట్ (MCLR)ని పెంచింది. బ్యాంకు ఈ చర్య వల్ల MCLRతో లింక్ ఉన్న కస్టమర్ల EMI పెరుగుతుంది. ఈ నెల ప్రారంభంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే.