SBI IMPS Charges: ఐఎంపీఎస్ బదిలీలపై ఛార్జీలు.. ఫిబ్రవరి 1 నుంచి షాకివ్వనున్న ఎస్‌బీఐ..!
SBI IMPS Charges: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 1, 2022 నుంచి కొత్త ఛార్జీలను విధించనుంది.
SBI IMPS Charges: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 1, 2022 నుంచి కొత్త ఛార్జీలను విధించనుంది. SBI శాఖల నుంచి చేసే IMPSపై బ్యాంక్ సర్వీస్ ఛార్జీని విధిస్తుంది. ఈ ఛార్జీని రికవరీ చేసేందుకు ఎస్‌బీఐ కొత్త స్లాబ్‌ను సిద్ధం చేసింది.
కొత్త స్లాబ్ కింద రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు చేసే బదీలపై ఒకరేటు, ఆపై దాటిన బదిలీలకు మరో రేటును వేయనున్నారు. బ్యాంక్ బ్రాంచ్‌ల నుంచి IMPS (తక్షణ చెల్లింపు సేవలు) లావాదేవీలపై వినియోగదారులకు సేవా ఛార్జీల కింద రూ. 20 + GST చెల్లించవలసి ఉంటుంది. కొత్త నిబంధనలు ఫిబ్రవరి 1, 2022 నుంచి అమలులోకి రాబోతున్నాయి.
బ్యాంకు శాఖల నుంచి జరిగే లావాదేవీలకు అంటే, రూ. 1,000 నుంచి రూ. 10,000 మధ్య లావాదేవీలకు రూ. 2 + GST చెల్లించాలి. IMPSలో చేసే రూ.10,000 నుంచి రూ.1,00,000 మధ్య బదిలీలకు రూ.4+GSTని, అలాగే రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల మధ్య బదిలీలకు రూ.12+GST చెల్లించాలి.
ఆన్‌లైన్ బదిలీపై ఎటువంటి ఛార్జీ లేదు..
అయితే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్‌లైన్ IMPS ద్వారా 5 లక్షల రూపాయల వరకు నిధుల బదిలీపై ఎటువంటి సేవా ఛార్జీని వసూలు చేయడంలేదని ప్రకటించింది. డిజిటల్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహించేందుకు ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు, రూ. 2 లక్షల వరకు IMPS (ఇమీడియట్ పేమెంట్ సర్వీస్) లావాదేవీలపై ఎటువంటి సేవా ఛార్జీలు లేవు.
డిజిటల్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహించేందుకు బ్యాంకులు ఇప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా యోనోతో సహా రూ. 5 లక్షల వరకు ఆన్‌లైన్ IMPS లావాదేవీలపై ఎటువంటి సేవా ఛార్జీలు ఉండవని తెలిపింది. విధించబడింది.