SBI: ఎస్బీఐ ఖాతాదారులకి అలర్ట్.. వెంటనే ఈ సమస్యని పరిష్కరించుకోండి..!
SBI: ఎస్బీఐ ఖాతాదారులకి అలర్ట్.. వెంటనే ఈ సమస్యని పరిష్కరించుకోండి..!
SBI: మీరు ఎస్బీఐ ఖాతాదారులైతే వెంటనే ఒక్కసారి ఖాతాని చెక్ చేయండి. లేదంటే చాలా నష్టపోతారు. ఎందుకంటే బ్యాంకు కేవైసీ చేయని వ్యక్తుల ఖాతాలని తాత్కాలికంగా స్తంభింపచేసింది. ఇప్పుడు ఖాతాదారులు ఎలాంటి లావాదేవీలు చేయలేరు. చాలా మంది కస్టమర్లు ఖాతా పనిచేయడంలేదని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. జీతాలు తీసుకునేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. KYC కారణంగా మీ ఖాతా కూడా స్తంభించబడి ఉంటే మీరు ఈ ప్రక్రియ ద్వారా సమస్యని పరిష్కరించుకోవచ్చు. అది ఏ విధంగా అనేది తెలుసుకుందాం.
జూలైలో అనేక మార్పులు జరిగాయి. ముఖ్యంగా బ్యాంకు ఖాతాలకి సంబంధించి e-KYC చేయడం అవసరం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులని వీలైనంత త్వరగా కేవైసీ చేయాలని మార్గదర్శకాలను జారీచేసింది. మోసపూరిత కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి కస్టమర్ KYCని ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఖాతాని ఫ్రీజ్ చేస్తారు.
KYC ప్రక్రియను పూర్తి చేయడానికి మీరు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ కాపీని బ్యాంకులో సమర్పించాలి. దీంతో పాటు మీరు బ్యాంకుకు వెళ్లి KYC ఫారమ్‌ను నింపాలి. తరువాత ఈ ఫారమ్‌ను పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు బ్యాంకులో అందించాలి. దీని తర్వాత KYC ప్రక్రియ పూర్తవుతుంది. అప్పుడు మీరు ఈ సమస్య నుంచి బయటపడుతారు.