Investment Plan: నెలకి రూ.600 పొదుపు చేస్తే చాలు.. కోటీ రూపాయలు మీ సొంతం..!
Investment Plan: మీరు చిన్న మొత్తంతో పెట్టుబడి ప్రారంభించి పెద్ద ఫండ్‌ను క్రియేట్ చేయవచ్చు.
Investment Plan: మీరు చిన్న మొత్తంతో పెట్టుబడి ప్రారంభించి పెద్ద ఫండ్‌ను క్రియేట్ చేయవచ్చు. అయితే దీనికి కొంచెం ఓపిక అవసరం. దీర్ఘకాలిక పెట్టుబడులు ఎల్లప్పుడూ ప్రయోజనాలను ఇస్తాయి. ఈ పరిస్థితిలో మీరు చిన్న మొత్తంలో మంచి భవిష్యత్తుకు పునాది వేయవచ్చు. మీరు ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టడానికి భయపడితే చిన్నగా ప్రారంభించండి. తక్కువ డబ్బుతో వీలైనంత త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. అప్పుడు మాత్రమే మీ లక్ష్యం సులభంగా నెరవేరుతుంది. ప్రతిరోజూ కేవలం 20 రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే కొన్ని రోజులకి మీరు మిలియనీర్ అవుతారు.
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP)లో ప్రతి నెలా కనీసం రూ.500 డిపాజిట్ చేయడం ద్వారా మీరు మంచి రాబడిని పొందవచ్చు. ఎంత ఎక్కువ రోజులుంటే అంత మంచి రాబడి వస్తుంది. కొన్ని ఫండ్లలో మీరు 20 శాతం వరకు రాబడిని పొందవచ్చు. 20 రూపాయలు డిపాజిట్ చేయడం ద్వారా కోటి రూపాయలు సంపాదించవచ్చు. ఒక 20 ఏళ్ల యువకుడు ప్రతిరోజూ 20 రూపాయలు ఆదా చేస్తే ఈ మొత్తం నెలకు 600 రూపాయలు అవుతుంది. ఈ మొత్తాన్ని ప్రతి నెలా SIPలో పెట్టుబడి పెట్టాలి. 40 ఏళ్లు అంటే దాదాపు 480 నెలల పాటు నిరంతరంగా 20 రూపాయలు డిపాజిట్ చేస్తే దాదాపు 10 కోట్ల రూపాయలు సమకూరుతాయి. ఈ పని కాస్త రిస్క్‌తో కూడుకున్నదే అయినప్పటికీ ఓపికతో చేస్తే ఖచ్చితంగా మీ లక్ష్యాన్ని పూర్తి చేస్తారు.