Reliance JIO 5G: దీపావళికి కానుకగా 'జియో' 5జీ సేవలు

Reliance JIO 5G: రూ.2.75 లక్షల కోట్ల కొత్త పెట్టుబడులు, FMCGలోకి ఈ ఏడాది ప్రవేశం

Update: 2022-08-30 04:47 GMT

దీపావళికి కానుకగా 'జియో' 5జీ సేవలు

Reliance JIO 5G: దీపావళి కానుకగా జియో 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. నాలుగు మెట్రో నగరాలు దిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలో జియో 5జీ అందుబాటులోకి తెస్తామని తెలిపింది. దశలవారీగా 2023 డిసెంబరు నాటికి ఇతర నగరాలు, పట్టణాలకు 5జీని విస్తరిస్తామని ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 5జీ సేవలను ప్రవేశపెట్టాలనేది జియో లక్ష్యమని రిలయన్స్ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్ అంబానీ ప్రకటించారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్‌ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో 5జీ సేవల వివరాలను ముకేశ్ వెల్లడించారు. పాన్‌ ఇండియా స్థాయిలో జియో 5జీ సాంకేతికత కోసం 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. అత్యంత నాణ్యమైన, అందుబాటు ధరల్లో జియో 5జీ సేవలను ప్రతి ఒక్కరికీ అందించనున్నట్లు ముకేశ్ అంబానీ తెలిపారు.

అటు తన వ్యాపార సంస్థల్లో బాధ్యతలను వారసులకు బదిలీ చేసే క్రమంలో పెద్ద కుమారుడు ఆకాశ్‌కు రిలయన్స్‌ జియో ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగించిన ముకేశ్.. రిటైల్‌ బిజినెస్‌ను కుమార్తె ఇషా అంబానీకు అప్పగించారు. రిలయన్స్‌ మాతృ సంస్థలో భాగమైన న్యూ ఎనర్జీ వ్యాపారానికి తన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీని లీడర్‌గా ప్రకటించారు. ఇక రిలయన్స్‌ రిటైల్‌ FMCG వ్యాపారంలోకి అడుగు పెట్టనున్నట్లు ఇషా ప్రకటించారు. ఆన్‌లైన్‌ గ్రోసరీ విభాగంలో రిలయన్స్‌ రిటైల్‌ దేశంలో నంబర్‌వన్‌గా ఉందన్నారు. 260 పట్టణాల్లో జియో మార్ట్‌ సేవలు అందిస్తోందని రోజుకు 6 లక్షల డెలివరీలు చేస్తున్నామని తెలిపారు. 

Full View


Tags:    

Similar News