Indian Railway: టికెట్‌ బుకింగ్‌ సమయంలో వెరిఫికేషన్‌ పూర్తి చేస్తున్నారా..!

Indian Railway: మీరు తరచుగా రైలులో ప్రయాణిస్తున్నట్లయితే ఈ వార్త మీకు బాగా ఉపయోగపడుతుంది

Update: 2022-07-12 07:01 GMT

Indian Railway:టికెట్‌ బుకింగ్‌ సమయంలో వెరిఫికేషన్‌ పూర్తి చేస్తున్నారా..!

Indian Railway: మీరు తరచుగా రైలులో ప్రయాణిస్తున్నట్లయితే ఈ వార్త మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) రైల్వే టిక్కెట్ బుకింగ్ నిబంధనలలో భారీ మార్పులు చేసింది. ఇప్పుడు టికెట్ బుక్ చేసుకునే ముందు దాని గురించి సరైన సమాచారాన్ని పొందడం చాలా ముఖ్యం. మీరు గత రెండు సంవత్సరాలుగా మీ IRCTC ఖాతా నుంచి టికెట్‌ బుక్‌ చేయకపోతే వెరిఫికేషన్‌ తప్పనిసరిగా చేయల్సి ఉంటుంది.

వాస్తవానికి ఈ వెరిఫికేషన్‌ పూర్తి చేయడానికి మీకు కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడిని ధృవీకరించాలి. తర్వాత కొన్ని నిమిషాల్లో టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చు. గత రెండేళ్లుగా తమ ఖాతా నుంచి ఎలాంటి బుకింగ్ చేసుకోని ప్రయాణికులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. మీరు ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేయకపోతే రైల్వే టిక్కెట్‌లను బుక్ చేయలేరు. కరోనా కాలంలో చాలా మంది రైల్వే ప్రయాణికులు రైలులో ప్రయాణించడం మానేశారు. ఈ కారణంగా వ్యక్తుల ఖాతా ధృవీకరణ తప్పనిసరి చేశారు. అయితే నిరంతరంగా రైల్వే టిక్కెట్లు బుక్ చేసుకునే వారు ఈ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సిన అవసరం లేదు.

ఇలా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయండి..

1. ముందుగా IRCTC వెబ్‌సైట్‌కి వెళ్లండి.

2. ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడిని ఎంటర్‌ చేయండి.

3. అక్కడ మీరు వెరిఫికేషన్ ఎంపికను చూస్తారు. దానిపై క్లిక్ చేయండి.

4. మీరు ఇక్కడ కావాలనుకుంటే మీ నంబర్ లేదా ఈ మెయిల్ IDని మార్చవచ్చు.

5. మీ నంబర్‌కి OTP వస్తుంది. దానిని ఇక్కడ ఎంటర్‌ చేయండి.

6. తర్వాత ఈ మెయిల్‌కి OTP వస్తుంది. అది ఎంటర్‌ చేయండి.

7. మీ నంబర్, ఈ మెయిల్ ఐడి ధృవీకరణ పూర్తయింది.

8. ఇప్పుడు మీరు మీ టిక్కెట్‌ను సులభంగా బుక్ చేసుకోగలుగుతారు.

Tags:    

Similar News