వారికి వడ్డీ లేకుండా 50 వేల రూపాయల రుణం.. ఇలా అప్లై చేసుకోండి..!

*ఒకసారి రుణాన్ని తిరిగి చెల్లించిన తర్వాత లబ్ధిదారుడు వడ్డీ రేటు లేకుండా రెండోసారి రుణంగా రెట్టింపు మొత్తాన్ని పొందవచ్చు.

Update: 2022-12-10 11:05 GMT

వారికి వడ్డీ లేకుండా 50 వేల రూపాయల రుణం.. ఇలా అప్లై చేసుకోండి..!

PM Svanidhi Yojana: దేశంలోని యువతకి ఉపాధి కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే సమయంలో చిరువ్యాపారం చేసుకునే వారిపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందుకోసం మోడీ ప్రభుత్వం ఒక పథకం అమలు చేస్తోంది. దీనిపేరు ప్రధానమంత్రి స్వానిధి యోజన. ఈ పథకం కింద వీధి వ్యాపారులకు వడ్డీ లేకుండా రూ. 50,000 వరకు రుణాన్ని మంజూరుచేస్తోంది.

ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే దీని కోసం మీకు ఎటువంటి పత్రాలు అవసరం లేదు. ప్రభుత్వం ప్రత్యేకంగా వీధి వ్యాపారుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఒకసారి రుణాన్ని తిరిగి చెల్లించిన తర్వాత లబ్ధిదారుడు వడ్డీ రేటు లేకుండా రెండోసారి రుణంగా రెట్టింపు మొత్తాన్ని పొందవచ్చు. ఈ పథకం కింద తీసుకున్న రుణ మొత్తాన్ని ఒక సంవత్సరం వ్యవధిలో తిరిగి చెల్లించవచ్చు. ఇది కాకుండా లబ్ధిదారుడు రుణ చెల్లింపును నెలవారీ వాయిదాలలో కూడా చెల్లించవచ్చు.

ఈ రుణంపై లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ సబ్సిడీ ఇస్తోంది. దీంతో పాటు రుణగ్రహీతలకు క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ పథకం చెల్లుబాటును మార్చి 2022 నుంచి డిసెంబర్ 2024 వరకు పొడిగించారు. వీధి వ్యాపారులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను తొలగించి వారిని స్వావలంబనగా తీర్చిదిద్దడమే ఈ పథకం లక్ష్యం.

పీఎం స్వానిధి యోజన నిబంధనలు

1. దరఖాస్తుదారు భారతదేశానికి చెందినవారు కావడం తప్పనిసరి.

2. వీధి వ్యాపారులు ఈ పథకానికి అర్హులు.

3. కరోనా కారణంగా వ్యాపారం దెబ్బతిన్న వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

4. రోడ్డు పక్కన స్టేషనరీ దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారు, చిన్న కళాకారులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

5. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఎలాంటి హామీదారు అవసరం లేదు.

6. లబ్ధిదారుడు రుణాన్ని వాయిదాల రూపంలో జమ చేయవచ్చు.

కావలసిన పత్రాలు

1. ఆధార్ కార్డు

2. ఓటరు గుర్తింపు కార్డు

3. రేషన్ కార్డు

4. పాస్‌బుక్ ఫోటోకాపీ

5. పాస్పోర్ట్ సైజు ఫోటో

Tags:    

Similar News