PM Kisan Yojana: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్... మీ ఖాతాల్లోకి ఈ సారి ఏకంగా రూ. 4 వేలు..!

PM Kisan Yojana: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులు 19వ విడత సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.

Update: 2024-12-05 12:19 GMT

PM Kisan: లక్షలాది మంది రైతులకు అదిరే వార్త..వెయ్యికోట్లతో మోదీ సర్కార్ మరో అద్భుత స్కీమ్

PM Kisan Yojana: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులు 19వ విడత సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. పంట పెట్టుబడి సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా ఏటా మూడు విడతల్లో రైతులకు 6వేలును డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా ఆధార్-లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ చేస్తుంది. అయితే నకిలీ ఖాతాలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది. కేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే 19వ విడత సాయం అందుతుంది. ఓటీపీ-ఆధారిత e-KYCని పూర్తి చేయడానికి, రైతులు తప్పనిసరిగా వారి బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన యాక్టివ్ మొబైల్ నంబర్‌ను కలిగి ఉండాలి.

పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా 2019లో ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. అప్పటినుంచి రైతులకు పంట సాయంగా ఏడాదికి ఉచితంగా 6 వేల రూపాయలు ఇస్తున్నారు. అర్హులైన రైతులంతా ఈ స్కీం బెనిఫిట్స్ అందుకుంటున్నారు. ప్రతేడాది మూడు విడతలుగా ఈ 6 వేల రూపాయలను ఏప్రిల్- జులై, ఆగస్టు- నవంబర్, డిసెంబర్- మార్చి సమయంలో ఎకరానికి 2 వేల చొప్పున కేంద్రం ఈ ఆర్థిక సాయం అందజేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల పీఎం కిసాన్ 18వ విడత నిధులు కూడా విడుదల చేశారు ప్రధాని మోదీ. 05 అక్టోబర్ 2024న రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బు జమ అయింది. పంట సాయంగా రూ. 2 వేలు రైతుల అకౌంట్లలో వేసింది మోదీ సర్కార్.

ఇప్పుడు పీఎం కిసాన్ 19వ విడతపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. నూతన సంవత్సర కానుకగా 19వ విడత నిధులు కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం. సంక్రాంతి పండగకు 19వ విడత డబ్బు రిలీజ్ చేయనున్నారట. ఇందుకు గాను జనవరి 15వ తేదీని ఫిక్స్ చేశారని సమాచారం. అయితే, పీఎం కిసాన్ 18వ విడతలో రూ. 2 వేలను అందుకోని రైతులకు ఆ డబ్బును 19వ విడతతో కలిపి జమ చేయనుంది మోదీ సర్కార్. 18వ విడత, 19 విడత కలిపి మొత్తం రూ. 4 వేలు ఆయా రైతుల ఖాతాల్లో జమకానున్నాయి. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు వద్దని సర్కార్ చెబుతోంది.

పీఎం కిసాన్ స్కీం ప్రయోజనాలను పొందాలంటే రైతులు తప్పనిసరిగా చేయాల్సిన పని కేవైసి అప్ డేట్. ఇందుకోసం పీఎం కిసాన్ అధికారిక పోర్టల్‌ pmkisan.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి మీ ఆధార్ నంబర్, ఫోన్ నంబర్‌, భూమికి సంబంధించిన వివరాలతో పీఎం కిసాన్ E- KYC పూర్తి చేయాలి. పీఎం కిసాన్ లబ్ధిదారుని స్టేటస్ చెక్ చేసుకోవాలి. అధికారిక పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ను విజిట్ చేసి “బెనిఫిషియరీ స్టేటస్” క్లిక్ చేయాలి. ఆపై మీ ఆధార్ నంబర్ లేదా ఖాతా నంబర్‌ను నమోదు చేసి లబ్ధిదారుడి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

Tags:    

Similar News