Petrol Rate: గత తొమ్మిది రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న పెట్రో ధరలు
Petrol Rate: ఎన్నికల నేపథ్యంలో పెట్రో ధరలను పెంచరాదన్న సూచనల మేరకు ఇంధన సరఫరా సంస్థలు ధరలు నిలకడగా
Petrol Rate: దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రో ధరలు గత తొమ్మిది రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పెట్రో ధరలను పెంచరాదన్న సూచనల మేరకు ఇంధన సరఫరా సంస్థలు ధరలను నిలకడగా కొనసాగిస్తున్నాయన్న వాదనలు విన్పిస్తున్నాయి. రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 90 రూపాయల 56 పైసలుగా వుండగా డీజిల్ ధర 80 రూపాయల 87 పైసలు వద్దకి చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర 94 రూపాయల 16 పైసలు వద్ద, డీజిల్ ధర 88 రూపాయల 20 పైసలు వద్ద కొనసాగుతున్నాయి. ఏపీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి.