Petrol Rate: ఎన్నికల నేపథ్యంలో నిలకడగా ఇంధన ధరలు

Petrol Rate: ఎన్నికల నేపథ్యంలో నిలకడగా ఇంధన ధరలు * అతి త్వరలో వాహనదారులకు ఊరట కలిగించే వార్త

Update: 2021-04-07 04:23 GMT

Representational Image

Petrol Rate: దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్ ,డీజిల్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఇంధన సరఫరా సంస్థలు పెట్రో ధరలను పెంచడం లేదన్న అభిప్రాయం వినవస్తోంది. లేదంటే ఇప్పటికే పెట్రోల్ రేటు వంద రూపాయలను దాటేసి ఉండేది. అయితే ప్రస్తుతం వాహనదారులకు ఊరట కలిగించే సమాచారం వినవస్తోంది. ఓపెక్ దేశాలు క్రూడాయిల్ ఉత్పత్తిని మే నుంచి జూలై వరకు రోజుకు 2 మిలియన్ బ్యారెల్స్ మేర పెంచేందుకు అంగీకారం తెలపడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది ఇప్పటికే కొండెక్కి కూర్చున్న పెట్రో ఉత్పత్తుల ధరలు రానున్న రోజుల్లో దిగిరావడం ఖాయమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 90 రూపాయల 56 పైసలుగా వుండగా డీజిల్ ధర 80 రూపాయల 87 పైసలు వద్దకి చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర 94 రూపాయల 16 పైసలు వద్ద, డీజిల్ ధర 88 రూపాయల 20 పైసలు వద్ద స్థిరంగా ఉన్నాయి.ఏపీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News