Petrol Diesel Price Today: 7వ రోజూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol Diesel Price Today: తాజాగా పెట్రోలుపై 25 పైసలు, డీజిల్‌పై 25 పైసలు పెంచాయి.

Update: 2021-05-12 05:35 GMT

Representational Image

Petrol Diesel Price Today: లాక్‌డౌన్లు, కర్ఫ్యూల కారణంగా ఇండియాలో పెట్రోల్ వాడకం తగ్గింది. అలాంటప్పుడు ధరలు తగ్గాలి. కానీ ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వరుసగా నేడు 7వ రోజు పెట్రోల్, డీజిల్ ధరను పెంచాయి. మే 2న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాగానే మే 4 నుంచి ఈ బాదుడు మొదలైంది. తాజాగా పెట్రోలుపై 25 పైసలు, డీజిల్‌పై 25 పైసలు పెంచాయి. ఫలితంగా ధరలు ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలను చేరుతున్నాయి.

ప్రధాన నగరాల్లో ...

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ రూ.0.25 పెరిగి రూ.92.05కి చేరింది. అలాగే డీజిల్ ధర లీటర్ రూ.0.25 పెరిగి రూ.82.61కి చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర లీటర్ రూ.0.24 పెరిగి రూ.98.36కి చేరింది. డీజిల్ ధర లీటర్ రూ.0.27 పెరిగి రూ.89.75 చేరింది. బెంగళూరులో పెట్రోల్ ధర లీటర్ రూ.0.26 పెరిగి రూ.95.11కి చేరింది. డీజిల్ లీటర్ రూ.0.26 పెరిగి రూ.87.57కి చేరింది. చెన్నైలో పెట్రోల్ లీటర్ రూ.0.22 పెరిగి రూ.93.84కి పెరగగా డీజిల్ లీటర్ రూ.0.24 పెరిగి రూ.87.49కి చేరింది. కోల్‌కతాలో పెట్రోల్ లీటర్ రూ.0.24 పెరిగి రూ.92.16కి చేరగా... డీజిల్ లీటర్ రూ.0.25 పెరిగి రూ.85.45కి చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో...

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.65 గా ఉంది. డీజిల్‌ ధర రూ.91.43 గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర 96.74 ఉండగా.. డీజిల్‌ ధర రూ.90.54 గా ఉంది. విజయనగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.36 గా ఉండగా, డీజిల్‌ ధర రూ.91.11 గా ఉంది.

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.95.13 గా ఉండగా.. డీజిల్‌ ధర రూ.89.47 కి చేరింది. వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 94.71 ఉండగా, డీజిల్‌ ధర రూ.89.06 ఉంది. కరీంనగర్‌లో పెట్రోల్‌ రూ.95.28 ఉండగా, డీజిల్‌ ధర రూ.89.59 గా ఉంది.

Tags:    

Similar News