దేశంలో పెట్రో ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. దేశంలోని మెట్రోనగరాల్లో రెండు వారాలుగా ఇంధన ధరలు స్థిరంగా వుండటంతో వాహనదారులకు ఉపశమనం లభించినట్లయింది. అయితే నవంబర్ 20 నుంచి ఇప్పటివరకు దాదాపు 17 సార్లు ఇంధన ధరలను సవరించడంతో పెట్రో ధరలు గరిష్టం వద్ద కొనసాగుతున్నాయి. రోజువారీ ధరల సమీక్షలో భాగంగా రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 2 రూపాయల 65 పైసలు, డీజిల్ ధర 3 రూపాయల 40 పైసలు చొప్పున పెరిగాయి. తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 87రూపాయల 06 పైసలు, డీజిల్ ధర లీటర్ 80.60 పైసల వద్ద కొనసాగుతున్నాయి.