దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వరుసగా మూడో రోజు భారత చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను యధాతధంగా వుంచాయి. వారం రోజులుగా పరుగులు తీసిన పెట్రో ధరలు తాజా వారంలో నిలకడగా వుండటంతో వాహనదారులకు ఉపశమనం లభించినట్లయింది. రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 83 రూపాయల 71 పైసలుగా వుండగా డీజిల్ ధర 73.87 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అదేవిధంగా హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 87 రూపాయల 06 పైసలు, డీజిల్ ధర లీటర్ 80.60 పైసల వద్ద కొనసాగుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ధరలు పెరుగుతున్నప్పటికీ దేశీయంగా స్థిరంగా వుండడం విశేషమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.