దేశంలోని మెట్రో నగరాల్లో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర గత 41 రోజులుగా యధాతధంగా వుండగా డీజిల్ రేట్లు గత 31 రోజులుగా ఎలాంటి పెరుగుదల లేకుండా సాగుతున్నాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 84 రూపాయల 25 పైసలు వద్దకు చేరగా డీజిల్ ధర లీటర్‌కు 76 రూపాయల 84 పైసలు వద్ద కొనసాగుతున్నాయి. ఇక గ్లోబల్ మార్కెట్ విషయానికి వస్తే ముడిచమురు ధరలకు కోవిడ్ సెగ తప్పడం లేదు, ప్రపంచ దేశాలను కరోనా సెకండ్ వేవ్ ప్రకంపనలు వణికిస్తుండటంతో క్రూడ్ ధరలు పతన బాటన సాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ లో బ్రెంట్, నైమెక్స్ చమురు ధరలు ఐదు శాతం మేర పడిపోయాయి.