Aadhaar Alert: ఆధార్‌ అలర్ట్‌.. ఈ వ్యక్తులు వివరాలని అప్‌డేట్‌ చేయాలి..!

Aadhaar Alert: ఆధార్‌ అలర్ట్‌.. ఈ వ్యక్తులు వివరాలని అప్‌డేట్‌ చేయాలి..!

Update: 2023-01-02 15:30 GMT

Aadhaar Alert: ఆధార్‌ అలర్ట్‌.. ఈ వ్యక్తులు వివరాలని అప్‌డేట్‌ చేయాలి..!

Aadhaar Alert: పదేళ్ల క్రితం ఆధార్ నంబర్ పొంది ఇప్పటివరకు ఎలాంటి వివరాలని అప్‌డేట్‌ చేయని వ్యక్తులు మళ్లీ సమాచారం అప్‌డేట్ చేయాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) తెలిపింది. 'మై ఆధార్ పోర్టల్' ద్వారా ఆన్‌లైన్‌లో సపోర్టింగ్ డాక్యుమెంట్‌లను (గుర్తింపు రుజువు, చిరునామా రుజువు) అప్‌డేట్ చేయాలని సూచించింది. ఇది కాకుండా వారు ఆధార్ కేంద్రాన్ని సందర్శించి ఆఫ్‌లైన్‌లో కూడా అప్‌డేట్‌ చేసుకోవచ్చని పేర్కొంది.

ఆధార్ గుర్తింపుకు రుజువుగా పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే 319 పథకాలకి ఆధార్ గుర్తింపుగా ఆమోదించారు. మీరు ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర పథకం ప్రయోజనం పొందినట్లయితే ఆధార్ కార్డ్‌లో POI, POAలను ఎల్లప్పుడూ అప్‌డేట్ చేస్తూ ఉండాలని UIDAI హెచ్చరించింది. ఆన్‌లైన్‌లో అప్‌డేట్ ప్రక్రియ చేపడితే రుసుము 25 రూపాయలు చెల్లించాలి. దీనివల్ల ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.

POI, POAలను ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అని పిలుస్తారు. జూలై 1, 2022న ఆధార్ జారీ చేసిన నోటీసు ప్రకారం గుర్తింపు రుజువు అంటే POI అప్‌డేషన్‌కు పేరు, ఫోటోతో కూడిన పత్రం అవసరం. పాన్ కార్డ్, ఈ-పాన్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఆయుధాల లైసెన్స్, ఫోటో బ్యాంక్ ఎటిఎమ్ కార్డ్, ఫోటో క్రెడిట్ కార్డ్, వివాహ ధృవీకరణ పత్రం, రైతు ఫోటో పాస్‌బుక్ వంటి పత్రాలను అప్‌డేట్ చేయడానికి రుజువులుగా సమర్పించవచ్చు. 

Tags:    

Similar News