తల్లిదండ్రులకి గమనిక.. ఎడ్యుకేషన్‌ లోన్‌ విషయంలో ఈ తప్పు చేయకండి..!

Education Loan: విద్యలేనివాడు వింత పశువు అన్నారు పెద్దలు. చదువుకున్న వారే సమాజంలో మార్పు తీసుకువస్తారు.

Update: 2022-07-06 04:30 GMT

తల్లిదండ్రులకి గమనిక.. ఎడ్యుకేషన్‌ లోన్‌ విషయంలో ఈ తప్పు చేయకండి..!

Education Loan: విద్యలేనివాడు వింత పశువు అన్నారు పెద్దలు. చదువుకున్న వారే సమాజంలో మార్పు తీసుకువస్తారు. విద్య ద్వారానే ప్రజలు ఆకాశమంత ఎత్తుకి ఎదుగుతారు. అయితే విద్యారంగంలో కూడా నిరంతర విప్లవం కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. నేటి యుగంలో ఉన్నత విద్య చాలా ఖరీదైనదిగా మారింది. అందుకే విద్యార్తులు నేడు విద్యా రుణాలను పొందుతున్నారు. దీని వల్ల విద్యార్థులు తమ లక్ష్యాలని పూర్తి చేసుకుంటున్నారు.

ప్రతి ఒక్కరూ మంచి విద్యను కోరుకుంటారు. ఇందుకోసం కొన్ని ఫీజులు చెల్లించాలి. కానీ చాలాసార్లు విద్యార్థులు ఫీజు చెల్లించడానికి డబ్బు ఉండదు. దీనివల్ల బ్యాంకుల నుంచి విద్యా రుణాలు తీసుకొని చదువుకుంటారు. ఎడ్యుకేషన్ లోన్ వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, పిల్లల తల్లిదండ్రులు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. బ్యాంకు అర్హులైన వారికి మాత్రమే విద్యా రుణం మంజూరు చేస్తుంది.

ఈ పరిస్థితిలో విద్యా రుణం కోసం తల్లిదండ్రులు అర్హత ప్రమాణాలను పూర్తి చేయాలి. అలాగే రుణాన్ని తిరిగి చెల్లించడానికి పిల్లలపై ఒత్తిడి చేయకూడదు. దీనివల్ల పిల్లలు ఇటు చదువుతో పాటు మరోవైపు డబ్బులు ఎలా చెల్లించాలో తెలియక మానసిక ఒత్తిడికి గురవుతారు. అంతేకాదు దీనివల్ల పిల్లల దృష్టి వేరేవైపునకు మళ్లే అవకాశాలు ఉన్నాయి. అందుకే తల్లిదండ్రులు పిల్లలని గమనిస్తూ వారిపై ఏ ఒత్తిడి పడకుండా చదువు పూర్తి చేసేలా చూడాలి. అప్పుడే వారు మంచి జాబ్‌ సంపాదించి లోన్‌ డబ్బులు చెల్లించే స్థితిలో ఉంటారు.

Tags:    

Similar News