Aadhaar-PAN Linking: ఆధార్‌-ఫ్యాన్‌ లింక్‌ చేశారా? కీలక ప్రకటన చేసిన ఐటీ శాఖ..!

PAN Aadhaar Link: నిన్నటితో అంటే జూన్ 30తో పాన్, ఆధార్ లింకింగ్ గడువు ముగిసింది.

Update: 2023-07-01 06:35 GMT

Aadhaar-PAN Linking: ఆధార్‌-ఫ్యాన్‌ లింక్‌ చేశారా? కీలక ప్రకటన చేసిన ఐటీ శాఖ..!

PAN Aadhaar Link: నిన్నటితో అంటే జూన్ 30తో పాన్, ఆధార్ లింకింగ్ గడువు ముగిసింది. అయితే, చివరి నిమిషంలో చాలా మంది ఆధార్-పాన్ లింక్ చేసిన ఇన్‌వాయిస్‌లను పొందడంలో సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే ఈవిషయంపై ఆదాయపు పన్ను శాఖ ప్రత్యేక చొరవ తీసుకుంది. పాన్-ఆధార్ లింక్ చేసే సమయంలో చేసిన చెల్లింపులకు సంబంధించి కీలక అప్‌డేట్ అందించింది. సోషల్ మీడియాలో ఓ ప్రకటనతో భారీ ఊరటనిచ్చింది.

నిర్ణీత సమయం తర్వాత పాన్, ఆధార్ కార్డ్ లింక్ చేయాలంటే మీరు కచ్చితంగా జరిమానా చెల్లించవలసి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. అదేవిధంగా అన్ని సేవలను పొందేందుకు ప్రతి ఒక్కరూ జూన్ 30 లోపు పాన్-ఆధార్ లింక్ చేసుకోవాలని వెల్లడించింది. అయితే, మరోసారి లాస్ట్ డేట్‌ను మార్చుతారని చాలామంది ప్రజలు ఆధార్-పాన్ లింక్ చేయడం ఆపేశారు. కానీ చివరికి అలా జరగలేదు. అయితే చివరి తేదీ తర్వాత పాన్, ఆధార్ లింక్ చేసేందుకు జరిమానాలు చెల్లించాల్సి వచ్చింది. అయితే, చివరి తేదీ కావడంతో చెల్లింపుల తర్వాత రిసీప్ట్‌లు పొందడంలో ఆలస్యం కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఆదాయపు పన్ను శాఖ అండగా నిలిచింది.

పాన్, ఆధార్ కార్డు లింకింగ్ కోసం చెల్లింపుల ఇన్‌వాయిస్‌‌ను డౌన్‌లోడ్ చేసుకోలేని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆదాయపు పన్ను శాఖ ఒక ట్వీట్‌లో తెలియజేసింది. ఇన్‌వాయిస్ స్టేటస్‌ని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ పోర్టల్‌లోకి లాగిన్ చేసి ఈ-పే ట్యాక్స్ ట్యాబ్‌కి వెళ్లడం ద్వారా చెక్ చేసుకోవచ్చు. చెల్లింపు పూర్తయినట్లు మీకు కనిపిస్తే, మీరు పాన్‌తో ఆధార్‌ను లింక్ చేయవచ్చని పేర్కొంది.

పాన్ - ఆధార్ లింక్‌ల కోసం వేర్వేరు చలాన్ రసీదులను డౌన్‌లోడ్ చేయవలసిన అవసరం లేదని కూడా తెలియజేసింది. ఎందుకంటే చెల్లింపు తర్వాత, రెండు గుర్తింపు పత్రాలు సరిగ్గా జతచేస్తేనే ఇన్‌వాయిస్ కాపీ ఈ-మెయిల్‌కు వస్తుంది. జూన్ 30లోగా చెల్లింపులు జరిపి, అటాచ్‌మెంట్ పెండింగ్‌లో ఉన్న వారికి ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది.


Tags:    

Similar News