EPFO: పీఎఫ్ ఖాతాదారులకి గమనిక.. ఇప్పుడు డబ్బులు విత్ డ్రా చేయడం చాలా సులభం..!
EPFO: ఉద్యోగులకి పీఎఫ్ డబ్బులు అత్యవసర సమయంలో ఉపయోగపడుతాయి. అయితే ఇప్పుడు ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేయడం సులభతరం చేసింది.
EPFO: ఉద్యోగులకి పీఎఫ్ డబ్బులు అత్యవసర సమయంలో ఉపయోగపడుతాయి. అయితే ఇప్పుడు ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేయడం సులభతరం చేసింది. ఆన్‌లైన్‌లో విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని ప్రవేశపెట్టడంతో చాలామంది సులువుగా డబ్బులు విత్ డ్రా చేసుకుంటున్నారు. దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతుండడంతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయం తర్వాత పీఎఫ్ ఖాతాదారులు డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి మూడు రోజుల పాటు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న గంటలోపే పీఎఫ్ మొత్తం మీ ఖాతాకు బదిలీ అవుతుంది. దీని కింద లక్ష రూపాయల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. మెడికల్ ఎమర్జెన్సీ కింద ప్రభుత్వం ఈ సదుపాయం కల్పిస్తోంది. ప్రభుత్వం ప్రారంభించిన ఈ సదుపాయంలో కరోనా రోగికి చికిత్స కోసం పిఎఫ్‌లో డిపాజిట్ చేసిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఇందుకోసం ముందుగా www.epfindia.gov.in వెబ్‌సైట్ హోమ్ పేజీకి వెళ్లండి.
ఇప్పుడు కుడి ఎగువ మూలలో ఇచ్చిన ఆన్‌లైన్ అడ్వాన్స్ క్లెయిమ్‌పై క్లిక్ చేయండి. https://unifiedportalmem.epfindia.gov.in/memberinterface
పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఆన్‌లైన్ సేవపై దావా ఫారమ్‌ను చూస్తారు. మీరు ఫారమ్-31,19,10C,10Dని చూస్తారు. మీ బ్యాంక్ ఖాతాలోని చివరి 4 అంకెలను ఎంటర్ చేయడం ద్వారా కన్‌ఫార్మ్ చేయండి. తర్వాత ఆన్‌లైన్ క్లెయిమ్ కోసం ప్రొసీడ్‌పై క్లిక్ చేయండి.
డ్రాప్ డౌన్ (ఫారం 31) నుంచి పీఎఫ్ అడ్వాన్స్‌ని ఎంచుకోండి. ఇప్పుడు మీకు డబ్బు కావాల్సిన కారణాన్ని ఎంచుకోండి. మొత్తాన్ని నమోదు చేసి చెక్కు స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేయండి. ఆపై మీ చిరునామాను ఎంటర్ చేయండి. గెట్ ఆధార్ OTPపై క్లిక్ చేసి ఆధార్ లింక్ చేసిన మొబైల్‌కి వచ్చిన OTP నెంబర్‌ని ఎంటర్ చేయండి. అప్పుడు మీ దరఖాస్తు ప్రాసెస్ అయిపోతుంది. కొన్ని గంటల్లో మీరు క్లెయిమ్ చేసిన డబ్బు బ్యాంక్ ఖాతాకు క్రెడిట్ అవుతుంది.