Mutual Fund SIP: 11 నెలల్లో 233% పెరిగి రికార్డు సృష్టించిన మ్యూచువల్ ఫండ్ సిప్

Mutual Fund SIP: మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో మొత్తం పెట్టుబడి నవంబర్ 2023లో రూ. 25,615.65 కోట్లతో పోలిస్తే, నవంబర్ 2024లో 135.38 శాతం పెరిగి రూ.60,295.30 కోట్లకు చేరుకుంది.

Update: 2024-09-22 13:00 GMT

Mutual Fund SIP : మ్యూచువల్ ఫండ్ సిప్‌పై సామాన్యుల్లో నమ్మకం నిరంతరం పెరుగుతోంది. దీంతో మ్యూచ్‌వల్ ఫండ్స్ పెట్టుబడుల పరిమాణంలో పెరుగుదల కూడా కనిపిస్తుంది. 2023 సంవత్సరంతో పోలిస్తే 2024 సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్ సిప్‌లో 233 శాతం పెరుగుదల కనిపించింది. మొత్తంగా చూస్తే మ్యూచువల్ ఫండ్స్ 135 శాతం వృద్ధిని కనబరిచాయి. దీన్ని బట్టి సాధారణ పెట్టుబడిదారుల విశ్వాసం సిప్‌లో నిరంతరం కనిపిస్తోందని చెప్పొచ్చు.

సిప్‌లో రికార్డు పెరుగుదల

ఈ సంవత్సరం జనవరి నుండి నవంబర్ వరకు సిప్‌లో మొత్తం నికర ప్రవాహం రూ. 9.14 లక్షల కోట్లు. ఇది 2023 సంవత్సరంలో రూ. 2.74 లక్షల కోట్లుగా నమోదైంది. అంటే సిప్‌లో 233% వృద్ధి కనిపించింది. నవంబర్ చివరి నాటికి కొత్త సిప్ ల సంఖ్య 49.47 లక్షలకు పెరిగింది. ఇది 2023 నవంబర్‌లో 30.80 లక్షలుగా ఉంది. ఇదికాకుండా, సిప్ AUM నవంబర్‌లో రూ. 13.54 లక్షల కోట్లకు తగ్గింది. ఇది 2023లో రూ. 9.31 లక్షల కోట్లుగా ఉంది.

గత ఏడాది కాలంలో ఇండియన్ మ్యూచువల్ ఫండ్ (MF) పరిశ్రమ 135% పైగా వృద్ధిని సాధించిందని ఒక నివేదిక పేర్కొంది. నికర AUM లో దాదాపు 39% పెరుగుదల కనిపించింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో దేశీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ రాబోయే సంవత్సరాల్లో అనేక రెట్లు వృద్ధిని సాధించడానికి సిద్ధంగా ఉందని ఐసీఆర్ఏ అనలిటిక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, హెడ్ అశ్విని కుమార్ అన్నారు.

మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో మొత్తం పెట్టుబడి నవంబర్ 2023లో రూ. 25,615.65 కోట్లతో పోలిస్తే, నవంబర్ 2024లో 135.38 శాతం పెరిగి రూ.60,295.30 కోట్లకు చేరుకుంది. గత ఏడాది నవంబర్‌లో రూ.49.05 లక్షల కోట్లుగా ఉన్న నికర ఏయూఎం దాన్ని అధిగమించింది. ఈ ఏడాది నవంబర్‌లో ఈ సంఖ్య రూ.68.08 లక్షల కోట్ల చరిత్రాత్మక స్థాయిని తాకింది. భారత్‌లోని అన్ని ఫండ్స్ బలమైన వృద్ధిని సాధించగా, ఈక్విటీ కేటగిరీ కింద లార్జ్ క్యాప్ ఫండ్స్ అత్యధిక ఇన్‌ఫ్లోలను చూశాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 2024 నవంబర్‌లో దాదాపు 731% పెరిగి రూ. 2547.92 కోట్లకు చేరుకుంది.

గ్లోబల్ అనిశ్చితి నేపథ్యంలో దేశీయ మార్కెట్లలో పెరుగుతున్న అస్థిరత మధ్య, లార్జ్, మిడ్ క్యాప్ ఫండ్స్ రాబోయే రోజుల్లో పెట్టుబడిదారులలో ఎక్కువ ఆకర్షణను కలిగి ఉండవచ్చని అశ్విని కుమార్ తెలిపారు. ఏయూఎంలో స్థిరమైన వృద్ధిని కనబరిచిన స్మాల్-క్యాప్, మిడ్-క్యాప్ ఫండ్స్ కూడా మీడియం నుండి దీర్ఘకాలికంగా పెట్టుబడిదారుల ఆసక్తిని ఆకర్షించే అవకాశం ఉంది.

Tags:    

Similar News