CIBIL స్కోరు తెలుసుకోవడం ఎలా.. ఈ విధంగా ట్రై చేయండి..?

CIBIL Score: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఖర్చులు పెరిగిపోయాయి. నెలవారీ జీతం కూడా సరిపోవడం లేదు.

Update: 2022-07-02 15:00 GMT

CIBIL స్కోరు తెలుసుకోవడం ఎలా.. ఈ విధంగా ట్రై చేయండి..?

CIBIL Score: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఖర్చులు పెరిగిపోయాయి. నెలవారీ జీతం కూడా సరిపోవడం లేదు. ఇలాంటి సమయంలో సామాన్యులు పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటారు. అయితే దీనికోసం బ్యాంకుకు వెళ్లాలంటేనే భయపడతారు. మీకు పర్సనల్ లోన్ లభిస్తుందా లేదా అనేది మీ CIBIL స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. మంచి CIBIL స్కోర్‌ ఉంటే మాత్రమే తక్కువ వడ్డీ రేట్లలో రుణాలు పొందవచ్చు.

300 నుంచి 900 మార్కుల మధ్య మెరుగైన CIBIL స్కోర్ ఉంటుంది. స్కోరు 750 మార్కులు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అప్పుడు బ్యాంకు మీకు సులభంగా రుణం ఇస్తుంది. ఇందులో CIBIL స్కోర్ ఎంత మెరుగ్గా ఉంటే అంత సులభంగా లోన్ పొందవచ్చు. CIBIL స్కోర్ 24 నెలల క్రెడిట్ చరిత్రపై ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్ భారతదేశంలో CIBIL స్కోర్‌ను అందించే ఏకైక ఏజెన్సీ. ఇది మీ వివరాలను తీసుకొని CIBILకి చెబుతుంది.

30% CIBIL స్కోర్ అనేది మీరు సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లిస్తున్నారా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది . సెక్యూర్డ్ లేదా అన్‌సెక్యూర్డ్ లోన్‌పై 25%, క్రెడిట్ ఎక్స్‌పోజర్‌పై 25% మరియు రుణ వినియోగంపై 20% ఉంటుంది. మీరు బ్యాంకు నుంచి రుణం తీసుకొని సకాలంలో చెల్లించకపోతే మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. మీకు క్రెడిట్ కార్డ్ ఉండి మీరు సకాలంలో బిల్లు చెల్లించకపోతే అది మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. మీరు మీ బ్యాంక్ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోయినా లేదా అందులో మైనస్ బ్యాలెన్స్ ఉన్నప్పటికీ మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది.

మీ CIBIL స్కోరు గురించి ఇలా తెలుసుకోండి..?

1. CIBIL వెబ్‌సైట్ www.cibil.comకి వెళ్లండి.

2. హోమ్ పేజీలో గెట్ యువర్ ఫ్రీ సిబిల్ స్కోర్‌పై క్లిక్ చేయండి.

3. ముందుగా మీ పేరు, ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయండి.

4. తర్వాత మీ ID ప్రూఫ్‌లో ఏదైనా (పాస్‌పోర్ట్ నంబర్, పాన్ కార్డ్ నంబర్, ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి నంబర్) ఎంచుకోండి. ఆపై మీ పిన్ కోడ్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్‌ను ఎంటర్‌ చేయండి.

5. మొత్తం సమాచారాన్ని అందించిన తర్వాత ఓకె క్లిక్ చేసి కొనసాగించండి.

6. మీ మొబైల్‌లో వచ్చిన వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP)ని నమోదు చేసి కొనసాగించుపై క్లిక్ చేయండి.

7. మీరు 'మీ నమోదు విజయవంతమైంది' అనే మెస్సేజ్‌ అందుకుంటారు. ఆపై వెబ్‌సైట్ డాష్‌బోర్డ్‌కి వెళ్లండి.

8. మీ CIBIL స్కోర్ మీ ముందు కనిపిస్తుంది.  

Tags:    

Similar News