ఈ స్కీమ్‌లో మీ భార్య పేరుపై పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెల లక్ష రూపాయల వడ్డీ పొందండి..!

ఈ స్కీమ్‌లో మీ భార్య పేరుపై పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెల లక్ష రూపాయల వడ్డీ పొందండి..!

Update: 2022-02-22 01:15 GMT

ఈ స్కీమ్‌లో మీ భార్య పేరుపై పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెల లక్ష రూపాయల వడ్డీ పొందండి..!

Invest SIP: ప్రైవేట్‌ ఉద్యోగమైనా, ప్రభుత్వ ఉద్యోగమైనా ప్రతి ఒక్కరూ తన కుటుంబ భవిష్యత్‌ గురించి ఆలోచిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 2004 తర్వాత జరిగిన రిక్రూట్‌మెంట్లలో పెన్షన్ సదుపాయం రద్దు చేశారు. దీంతో రిటైర్మెంట్‌కి ఇప్పటి నుంచే ప్లాన్‌ చేసుకోవడం తెలివైన పని. ఇందుకోసం ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టండి. ద్రవ్యోల్బణం ప్రతిరోజూ పెరుగుతోంది. కాబట్టి మీరు రిటైర్మెంట్ తర్వాత కనీసం నెలకు రూ.1 లక్ష వడ్డీ లేదా ఆదాయాన్ని ఉండేవిధంగా ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. అందుకోసం ఇప్పటి నుంచే కొంత డబ్బును మీ భార్య పేరిట డిపాజిట్ చేయడం ప్రారంభించండి.

బ్యాంకుల సగటు వడ్డీ రేటు 5 శాతంగా ఉంది. ఇది సమీప భవిష్యత్తులో తగ్గే అవకాశం లేదు. దీని ప్రకారం మీరు ప్రతి నెలా రూ.1 లక్ష వడ్డీకి 2.40 కోట్ల కార్పస్ కలిగి ఉండాలి. రిటైర్మెంట్‌ సమయంలో ఈ ఫండ్‌ క్రియేట్‌ చేయడానికి SIP ఉత్తమ పెట్టుబడి ఎంపికగా చెప్పవచ్చు. మీ వయస్సు 30 సంవత్సరాలు అనుకుందాం. కాబట్టి మీ భార్య పేరు మీద నెలకు కనీసం రూ.3500 SIPని ప్రారంభించండి. గత 10 సంవత్సరాల రికార్డును పరిశీలిస్తే SIPలు సగటున 15 శాతం రాబడిని ఇచ్చాయి. దీని ప్రాతిపదికగా తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. 

30 ఏళ్లపాటు ప్రతి నెలా రూ. 3500 ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు రూ.12.60 లక్షలు పెట్టుబడి పెడతారు. దీనిపై మీరు ప్రతి సంవత్సరం సగటున 15 శాతం రాబడిని పొందినట్లయితే 30 సంవత్సరాలు తర్వాత ఈ మొత్తం దాదాపు రూ. 2 కోట్ల 45 లక్షలకు చేరుకుంటుంది. ఈ మొత్తంపై వార్షిక వడ్డీ 5 శాతం లెక్కిస్తే ప్రతి నెలా రూ.1 లక్ష కంటే ఎక్కువ వడ్డీ వస్తుంది. 

Tags:    

Similar News