South India Tour: సౌత్ ఇండియా టూర్ ప్లాన్ చేస్తున్నారు.. 6 రోజులు, 6 ప్రదేశాలు.. తక్కువ ధరలోనే..!

Bharat Gaurav Tourist: భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా దక్షిణ భారతదేశంలో పర్యటించేందుకు రైల్వే గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ప్రయాణం ముంబైలో ప్రారంభం కానుంది.

Update: 2023-11-20 13:30 GMT

South India Tour: సౌత్ ఇండియా టూర్ ప్లాన్ చేస్తున్నారు.. 6 రోజులు, 6 ప్రదేశాలు.. తక్కువ ధరలోనే..!

IRCTC South India Tour: మీరు కొత్త సంవత్సరంలో మీ కుటుంబంతో కలిసి దక్షిణాదికి ట్రిప్ ప్లాన్ చేస్తుంటే, IRCTC మీ కోసం ఒక గొప్ప టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ ముంబై నుంచి ప్రారంభమవుతుంది.

ఇది రైలు ప్యాకేజీ, దీనిలో మీరు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా ముంబై, మదురై, రామేశ్వరం, కన్యాకుమారి, త్రివేండ్రం, కోవలం పర్యటనకు వెళ్లవచ్చు.

ఈ ప్యాకేజీ జనవరి 16 నుంచి ప్రారంభమవుతుంది. జనవరి 21, 2024 వరకు కొనసాగుతుంది. ఈ ప్యాకేజీలో మీకు అల్పాహారం, రాత్రి భోజనం సౌకర్యం లభిస్తుంది.

ఈ ప్యాకేజీలో మీరు 3 స్టార్ హోటల్‌లో బస చేసే అవకాశం లభిస్తుంది. ఈ ప్యాకేజీలో మీరు AC కోచ్‌కి, రైలు టిక్కెట్‌ను పొందుతారు.

మీరు ఎక్కడికైనా వెళ్లి రావడానికి బస్సు, ప్రయాణ బీమా సౌకర్యాన్ని పొందుతున్నారు.

ఈ ప్యాకేజీలో ఒంటరిగా ప్రయాణిస్తే రూ.51,100లుగా ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు ప్లాన్ చేస్తే రూ.39,600లుగా పేర్కొంది. ముగ్గురు వ్యక్తులు ప్లాన్ చేస్తే ఒక్కొక్కరికి రూ.38,000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News