New Rules From June 1: జూన్1 నుంచి కొత్త నియమాలు అమలు.. సామాన్యుల జేబుపై మరింత భారం..!

New Rules From June 1: జూన్ 1 నుంచి చాలా విషయాలలో మార్పులు సంభవిస్తున్నాయి. సామాన్యుడి జేబుపై మరింత భారం పడుతోంది.

Update: 2024-05-28 09:30 GMT

New Rules From June 1: జూన్1 నుంచి కొత్త నియమాలు అమలు.. సామాన్యుల జేబుపై మరింత భారం..!

New Rules From June 1: జూన్ 1 నుంచి చాలా విషయాలలో మార్పులు సంభవిస్తున్నాయి. సామాన్యుడి జేబుపై మరింత భారం పడుతోంది. డ్రైవింగ్ లైసెన్స్ నుంచి గ్యాస్ సిలిండర్ వరకు అన్ని నియమాలు మారుతాయి. కొత్త నెల ప్రారంభం నుండి కొత్త నియమాలు అమలులోకి వస్తాయి. మీరు వీటి గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే ఇబ్బందులు పెరుగుతాయి. జూన్ 1 నుంచి ఏయే విషయాలు మారుతున్నాయో ఈ రోజు తెలుసుకుందాం.

గ్యాస్ సిలిండర్ ధర మారవచ్చు

చమురు కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను మారుస్తుంటాయి. ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయం 6 గంటలకు గ్యాస్ సిలిండర్ ధరలను విడుదల చేస్తారు. ఈసారి జూన్ 1న గ్యాస్ సిలిండర్ల కొత్త రేట్లు విడుదల కానున్నాయి. 14 కిలోల డొమెస్టిక్, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు నిర్ణయిస్తాయి.

ఆధార్ కార్డ్ అప్‌డేట్

యూఐడీఏఐ ఆధార్ కార్డ్ అప్‌డేట్ గురించి సమాచారం ఇచ్చింది. ఆధార్ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి జూన్ 14 వరకు గడువు విధించింది. మీరు ఎటువంటి రుసుము లేకుండా జూన్ 14 వరకు ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ అప్‌డేట్ కోసం అంటే ఆధార్ కేంద్రానికి వెళ్లడం కోసం మీరు ఒక్కో అప్‌డేట్‌కు రూ. 50 చొప్పున చెల్లించాలి.

డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్

జూన్ 1 నుంచి ట్రాఫిక్ రూల్స్ కూడా మారాయి. జూన్ 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఓకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు డ్రైవింగ్ స్కూల్‌కు వెళ్లి మీ డ్రైవింగ్ లైసెన్స్ని పొందవచ్చు. కొత్త నిబంధన ప్రకారం ఆర్టీవో ఆఫీసుకి వెళ్లి పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. అధీకృత ప్రైవేట్ డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి డ్రైవింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించవచ్చు.

మైనర్ డ్రైవింగ్ చేస్తే రూ.25,000 జరిమానా

జూన్ 1 నుంచి 18 ఏళ్లలోపు మైనర్ వాహనం నడిపితే భారీ జరిమానా విధిస్తారు. మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే రూ.25 వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ చర్య తీసుకుంటున్నారు.

Tags:    

Similar News