Hero MotoCorp: ధరలు పెంచుతున్న హీరో.. జూలై 1 నుంచి బైక్‌లు, స్కూటర్లు మరింత ప్రియం..!
Hero MotoCorp: ద్విచక్రవాహన కొనుగోలుదారులకి ఇది బ్యాడ్‌న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రముఖ కంపెనీ హీరో మోటోకార్ప్ జూలై 1 నుంచి ధరలని పెంచుతుంది.
Hero MotoCorp: ద్విచక్రవాహన కొనుగోలుదారులకి ఇది బ్యాడ్‌న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రముఖ కంపెనీ హీరో మోటోకార్ప్ జూలై 1 నుంచి ధరలని పెంచుతుంది. హీరో మోటోకార్ప్ ప్రకారం.. పెరుగుతున్న వస్తువుల ధరల కారణంగా ద్రవ్యోల్బణం పెరిగింది. దీని కారణంగా ద్విచక్ర వాహనాల తయారీ ఖర్చు పెరిగింది. అందుకే కంపెనీ తన మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరలను రూ. 3,000 పెంచాలని నిర్ణయించింది.
జూలై 1, 2022 నుంచి కంపెనీ మోటార్‌సైకిల్ స్కూటర్ల ధరలను పెంచబోతున్నట్లు హీరో మోటోకార్ప్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. ఇన్‌పుట్ ధర పెరగడమే ధరల పెరుగుదలకు కారణమని కంపెనీ పేర్కొంది. కమోడిటీ ధరల పెరుగుదల కారణంగా ధరను పెంచే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. అలాగే మోటారు సైకిళ్లు, స్కూటర్ల మోడళ్లను బట్టి ధరల పెరుగుదల ఆధారపడి ఉంటుందని తెలిపింది.
హీరో మోటోకార్ప్ గత ఏడాది కాలంలో నాలుగోసారి స్కూటర్ మోటార్‌సైకిళ్ల ధరలను పెంచుతోంది. గతంలో జూలై 1, 2021న రూ.3,000, సెప్టెంబర్ 30న రూ.3,000, జనవరి 1, 2022 నుంచి రూ.2,000, ఇప్పుడు రూ.3,000 పెంచాలని నిర్ణయించారు. దీంతో సామాన్యులు ద్విచక్రవాహనాలు కొనాలంటే తడిసి మోపడవుతుంది.