Mutual Funds: మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేశారా.. స్మాల్‌క్యాప్‌, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ మధ్య తేడాలేంటి..?

Mutual Funds: ఈ రోజుల్లో చాలామంది మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. చిన్న చిన్న నగరాల్లో ఈ సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.

Update: 2023-11-26 15:00 GMT

Mutual Funds: మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేశారా.. స్మాల్‌క్యాప్‌, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ మధ్య తేడాలేంటి..?

Mutual Funds: ఈ రోజుల్లో చాలామంది మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. చిన్న చిన్న నగరాల్లో ఈ సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అయితే ఇప్పటికీ కొంతమందికి మ్యూచ్‌వల్ ఫండ్స్‌ అంటే ఏంటో తెలియదు. ఇదేదో స్టాక్‌ మార్కెట్‌కి సంబంధించినదిగా అనుకుంటారు. కొంతమంది వీటిలో ఇన్వెస్ట్‌ చేసిన ఇందులో ఏం జరుగుతుందో తెలియదు. మీరు సాధారణ ఇన్వెస్టర్ అయితే మీకు ఏ ఫండ్ సూట్‌ అవుతుందో తెలుసుకోవాలి.

మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్‌, మల్టీ క్యాప్, లార్జ్ క్యాప్ అని రకరకాలుగా ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ వారి సొంత ప్రయోజనాలు ఉంటాయి. వాటి కనుగుణంగా ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. అంతే మొత్తంలో నష్ట ప్రమాదం కూడా ఉంటుంది. అయితే ఈ ఫండ్స్‌ మధ్య తేడాలు తెలిస్తే మీరు ఇన్వెస్ట్‌ చేయడానికి సులువుగా ఉంటుంది. స్మాల్ క్యాప్ ఫండ్ మార్కెట్ క్యాప్ రూ. 5000 కోట్ల కంటే తక్కువ. మిడ్ క్యాప్ రూ. 5,000 నుంచి రూ. 20,000 కోట్ల మధ్య ఉంటుంది. లార్జ్ క్యాప్ మార్కెట్ క్యాప్ రూ. 20,000 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుంది.

చిన్నదానిలో పెద్ద లాభం

వీటిలో స్మాల్ క్యాప్ ఫండ్స్ ఎక్కువ రిస్క్ కలిగి ఉంటాయి కానీ అత్యధిక రాబడి అందిస్తాయి. ఎందుకంటే స్మాల్ క్యాప్ తర్వాత మిడ్, లార్జ్‌ క్యాప్‌గా మారుతుంది. మారుతున్న కొద్దీ రాబడులు తదనుగుణంగా పెరుగుతాయి. ఇప్పుడు మనం మల్టీ క్యాప్ ఫండ్ గురించి మాట్లాడినట్లయితే సెబీ నిబంధనల ప్రకారం మల్టీ క్యాప్ ఫండ్‌ను జారీ చేసే ఫండ్ హౌస్ తన డబ్బులో 25,25,25 శాతం లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీలలో ఇన్వెస్ట్‌ చేయాలి. మిగిలిన 25% ఫండ్ మేనేజర్ తన ఇష్టానుసారం ఏదైనా మంచి ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తాడు.

మెరుగైన రాబడులు

మల్టీ క్యాప్ ఎల్లప్పుడూ తక్కువ రిస్క్‌తో మెరుగైన రాబడిని అందిస్తుంది. పెట్టుబడిదారులు ఎప్పుడూ ఒకే రకమైన ఫండ్‌లో డబ్బును ఇన్వెస్ట్‌ చేయకూడదు. చిన్న, మధ్య, బహుళ, పెద్ద క్యాప్‌ల వివిధ కంపెనీలలో ఇన్వెస్ట్‌ చేస్తూ ఉండాలి. కొద్ది రోజులకు మారుస్తూ ఉండాలి. దీనివల్ల మార్కెట్‌ ఒడిదొడుకులకు ఓర్చుకొని మంచి రాబడి సంపాదిస్తారు.

Tags:    

Similar News