రైల్వే ప్రయాణికులకి శుభవార్త.. ఇప్పుడు ఆ ఛార్జి చెల్లించనవసరం లేదు..!

Indian Railway: మీరు ఎక్కువగా రైలు ప్రయాణం చేసేవారైతే ఇది మీకు శుభవార్తనే చెప్పాలి.

Update: 2022-07-20 02:30 GMT

రైల్వే ప్రయాణికులకి శుభవార్త.. ఇప్పుడు ఆ ఛార్జి చెల్లించనవసరం లేదు..!

Indian Railway: మీరు ఎక్కువగా రైలు ప్రయాణం చేసేవారైతే ఇది మీకు శుభవార్తనే చెప్పాలి. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రీమియం రైళ్లలో సర్వీస్ ఛార్జీని రద్దు చేసింది. ఈ మేరకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కి (ఐఆర్‌సీటీసీ)కి సర్క్యులర్ జారీ చేసింది. దీనికి ముందు ఐఆర్‌సీటీసి రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఆహారం, పానీయాలను ఆర్డర్ చేయడానికి రూ. 50 సర్వీస్ ఛార్జీని వసూలు చేసేది.

ఇప్పుడు ప్రీమియం రైళ్లలో ప్రయాణించేవారు సర్వీస్ ఛార్జీలు చెల్లించనవసరం లేదు. ప్రస్తుతం ఉన్న ధరకే టీ, నీళ్లు లభిస్తాయి. కానీ అల్పాహారం, ఆహారం కోసం మాత్రం 50 రూపాయలు సేవా ఛార్జీగా చెల్లించాలి. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. సర్వీస్ ఛార్జీలు డిమాండ్ చేయడం సరికాదని ఇటీవల వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. సర్వీస్ ఛార్జ్ ఏ హోటల్ లేదా రెస్టారెంట్ వసూలు చేయరాదు. ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.

ఈ నెల సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) సర్వీస్ ఛార్జీకి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. CCPA సర్వీస్ ఛార్జీలను నిషేధించింది. ఈ ఆర్డర్ తర్వాత హోటల్‌లు, రెస్టారెంట్‌లు కస్టమర్‌ని సర్వీస్ ఛార్జ్ చెల్లించమని ఒత్తిడి చేయలేరు. సర్వీస్ ఛార్జ్ చెల్లించాలా వద్దా అనేది కస్టమర్ సొంత నిర్ణయం. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా సర్వీస్ ఛార్జి చెల్లించాలని డిమాండ్‌ చేసినట్లయితే మీరు CCPAకి ఫిర్యాదు చేయవచ్చు.

Tags:    

Similar News