ఉద్యోగులు పెన్షనర్లకి శుభవార్త.. రిటైర్మెంట్ చేసిన వెంటనే ప్రయోజనం..!
Pensioners: ఉద్యోగులు పెన్షనర్లకి ఇది శుభవార్త అని చెప్పాలి.
Pensioners: ఉద్యోగులు పెన్షనర్లకి ఇది శుభవార్త అని చెప్పాలి. ఇప్పుడు ఒక ఉద్యోగి రిటైర్మెంట్ చేసిన నెల నుంచి పెన్షన్ అందిస్తారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)మొదటిసారిగా లూథియానాలో దీనిని ప్రవేశపెడుతోంది. తర్వత దీనిని దేశవ్యాప్తంగా ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ విషయమై కేంద్ర కమిటీ ముందు ప్రజెంటేషన్ కూడా పూర్తయింది.
ఈ పద్దతి విజయవంతమైన తర్వాత పంజాబ్ అంతటా ఆ తర్వాత దేశం మొత్తం అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈపీఎఫ్‌వో రూపొందించిన అత్యుత్తమ పైలట్ ప్రాజెక్ట్‌లలో ఇది ఒకటి. ఇందుకోసం ఒకే నెలలో రిటైర్మెంట్ చేసిన ఉద్యోగులందరికి ఏకకాలంలో పెన్షన్ సర్టిఫికెట్ అందిస్తారు. ఇందుకోసం రిటైర్మెంట్ నెలలో ఈపీఎఫ్‌వోకి చెల్లించాల్సిన పీఎఫ్ సహకారాన్ని ముందస్తుగా చెల్లించాలి.
అవసరమైన పత్రాలు, అవసరమైన పెన్షన్ క్లెయిమ్‌లను పీఎఫ్ కార్యాలయంలో ఫైల్ చేయాలి. ఉద్యోగి రిటైర్మెంట్ చేసిన నెల 15లోపు ECR (ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్) దాఖలు చేయాలి. ఇది కాకుండా పింఛనుదారులు అవసరమైన పత్రాలతో పాటు ఫారం-10డిని పిఎఫ్ కార్యాలయంలో సమర్పించడం తప్పనిసరి.ఈ విషయంలో ఈపీఎఫ్‌వో ఉద్యోగి మాట్లాడుతూ.. సెంట్రల్ పిఎఫ్ కమిషనర్ మార్గదర్శకత్వంతో ఈ ప్రాజెక్ట్ వేగంగా పని చేస్తుందని చెప్పారు. ఇది మొత్తం పంజాబ్‌లో అమలు అవుతుంది. తర్వాత దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.