Today Gold Rate: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Today Gold Rate: బంగారం ధరలు భారీగా తగ్గాయి. దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు నేలచూశాయి. తులం బంగారం ధర 24 క్యారెట్లు రూ. 1,100 తగ్గింది. కిలో వెండి ధర రూ. 2,200 వరకు పతనం అయ్యింది.

Update: 2024-08-07 00:49 GMT

Today Gold Rate: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Today Gold Rate: దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం ధర 24క్యారెట్లు రూ. 1100తగ్గి, రూ. 71,700లకు పతనం అయ్యింది. మంగళవారం తులం బంగారం ధర రూ. 72,800 వద్ద స్థిరపడిన విషయం తెలిసిందే. మరోవైపు కిలో వెండి ధర వరుసగా నాలుగో రోజు రూ. 2,200 వరకు నష్టపోయి రూ. 82వేలకు చేరింది. సోమవారం కిలో వెండి ధర రూ. 84, 200 పలికింది. ఈ నెల రెండో తేదీ నుంచి కిలో వెండి ధర రూ. 4,200 వరకు తగ్గింది.

నేడు హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 63,890గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 69,700గా నమోదైంది. విజయవాడలో కూడా ఈ ధరలే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు ఉన్నాయి.

రిటైల్ కొనుగోలు దారులు, జ్యువెల్లరీ వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడం వల్లే బంగారం ధరలు తగ్గాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ తెలిపారు. అమెరికా డాలర్ మీద రూపాయి మారకం విలువ బలహీనతలు, త్వరలో పండగల సీజన్ ప్రారంభం అవ్వడంతో దేశీయ బులియన్ మార్కెట్లో బంగారానికి మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి బంగారం ధర లక్ష రూపాయలు దాటుతుందని కొందరు మార్కెట్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్య్ంలో బంగారం కొనుగోలుపై జనం మొగ్గు చూపిస్తున్నారు. బంగారం, వెండి ధరల్లో ఈ పతనం ఆభరణాలు కొనుగోలు చేయడానికి, పెట్టుబడి పెట్టుబడి పెట్టడానికి మంచి సమయంగా భావిస్తున్నారు.

Tags:    

Similar News