Gold and Silver Rates Today: స్థిరంగా బంగారం, తగ్గిన వెండి ధరలు...
Gold and Silver Rates Today: ఈ రోజు బంగారం, వెండి ధరలు...
Gold and Silver Rates Today: పరుగులు పెడుతూ వచ్చిన బంగారం ధరలకు ఆదివారం బ్రేక్ పడింది. ధరలలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.
హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.48,200గా ఉంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన బంగారం ధర రూ.52,590గా నమోదైంది. బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. వెండి ధరలు మాత్రం దిగొచ్చాయి. కేజీ వెండి ధర రూ.400 తగ్గి రూ.73,800 నుంచి రూ.73,400కు పడిపోయింది.
ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధరలు... 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.48,200గా, 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,590గా రికార్డయ్యాయి. ఇక పోతే దేశ రాజధానిలో వెండి ధర భారీగా తగ్గిపోయింది. కేజీ వెండి ధర రూ.1,100 మేర పడిపోయి రూ.68,900గా నమోదైంది.
ముంబైలో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.48,200గా, 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,590గా రికార్డయ్యాయి. కేజీ వెండి ధర అయితే ఏకంగా వెయ్యి రూపాయలపైన తగ్గి రూ.68,900గా నమోదైంది.
దేశమంతా బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. చెన్నైలో మాత్రం ధరలు తగ్గాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.48,540 నుంచి రూ.48,440కు పడిపోయింది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.120 మేర తగ్గి రూ.52,840గా నమోదైంది. చెన్నైలో సిల్వర్ రేటు కేజీ రూ.400 తగ్గి రూ.73,400గా రికార్డయింది.