Gold Rate Today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు..తులంపై ఎంత పెరిగిందంటే?
Gold Rate Today: దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీతోపాటు హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Gold Rate Today:శ్రావణమాసం ప్రారంభమైంది. ఈ మాసంలో వివాహాది శుభకార్యాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. మొన్నటి వరకు తగ్గినట్లే తగ్గిన బంగారం, వెండి ధరలు గత రెండు మూడు రోజుల నుంచి ఒక్కసారిగా పెరుగుతున్నాయి. బంగారంపై సుంకం తగ్గించిన తర్వాత ఏకంగా రూ. 4వేలు తగ్గడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గుతాయని భావించారు. కానీ అంతర్జాతీయ పరిమాణాలతో బంగారంతోపాటు వెండి ధర కూడా భారీగా పెరుగుతోంది.
బంగారం ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరగడానికి ప్రధాన కారణము అమెరికా ఆర్థిక మాంద్యం సూచనలే ప్రధానంగా కనిపిస్తున్నాయి దీంతోపాటు ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కూడా ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఇక దేశీయంగా బంగారం ధరలు ఇప్పటికే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీ సరాఫా బజార్లో 71 వేల రూపాయలు దాటింది ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో కూడా బంగారం ధరలు రికార్డు స్థాయిలో కదులుతున్నాయి. ఆగస్టు 6 వ తేదీ మంగళవారం హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71,075 రూపాయలుగా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 65,110 రూపాయలుగా ఉంది. ఇక ఏపీ రాజధాని విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71,100గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 65,150 రూపాయలుగా ఉంది. ఇక ఏపీలో ప్రధాన నగరమైన విశాఖ పట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71,100గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 65,150 రూపాయలుగా ఉంది. అదే సమయంలో మరో ప్రముఖ పట్టణం తిరుపతిలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71,110గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర 65,140 రూపాయలుగా ఉంది.