Svanidhi Yojana: మీకు ఆధార్‌ కార్డ్ ఉందా.? ఇట్టే రూ. 50,000 పొందొచ్చు..!

చిరు వ్యాపారులకు తక్కువ వడ్డీతో రుణాలు అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. చిన్న చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే వారికి నెలవారీ తక్కువ మొత్తంలో ఈఎమ్‌ఐ రూపంలో చెల్లించేలా ఈ పథకాన్ని రూపొందించారు.

Update: 2024-08-09 07:10 GMT

Svanidhi Yojana: మీకు ఆధార్‌ కార్డ్ ఉందా.? ఇట్టే రూ. 50,000 పొందొచ్చు..!

Svanidhi Yojana: కరోనా తదనంతర పరిస్థితుల తర్వాత తీవ్రంగా నష్టపోయిన చిరు వ్యాపారులకు అండగా నిలవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి స్వానిధి యోజన పేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. చిరు వ్యాపారులకు తక్కువ వడ్డీతో రుణాలు అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. చిన్న చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే వారికి నెలవారీ తక్కువ మొత్తంలో ఈఎమ్‌ఐ రూపంలో చెల్లించేలా ఈ పథకాన్ని రూపొందించారు.

ఈ పథకం ద్వారా ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రూ. 50,000 రుణం పొందొచ్చు. ఎలాంటి హామీ లేకుండానే డబ్బులు పొందొచ్చు. అయితే మొదటి సారే రూ. 50 వేలు పొందలేరు. తొలుత రూ. 10 వేలు తీసుకొని తిరిగి ఎలాంటి డ్యూస్‌ లేకుండా చెల్లించిన వారికి రుణ మొత్తాన్ని పెంచుతారు. మొదట రూ. 10 వేలు, ఆ తర్వాత రూ. 20వేలు, చివరిగా రూ. 50 వేల రుణం అందిస్తారు. ఈ రుణసదుపాయం పొందాలంటే మీకు ఒక ఆధార్‌ కార్డు ఉంటే సరిపోతుంది. దగ్గరల్లో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇందుకు సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చు.

మీరు రుణానికి అర్హులో కాదో సరిచూసుకున్న తర్వాత బ్యాంకులు రుణాలు అందిస్తారు. గతంలో ఏవైనా లోన్స్ తీసుకొని చెల్లించడంలో విఫలైమన వారికి లోన్‌లు చెల్లించరు. ఇక తక్కువ వడ్డీకే ఈ రుణాలను పొందొచ్చు. వీధి వ్యాపారాలతో పాటు, చిన్న చిన్న దుకాణాలు ఉన్న వారు ఈ రుణాలు పొందొచ్చు. ఇక ఈ రుణాలకు దరఖాస్తు చేసుకునే వారు 18 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎలాంటి రుణాలు బ్యాలెన్స్‌ ఉండకూదు. ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 50 వేలు రుణం పొందొచ్చు. తర్వాత సులభ వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News