Stock Market: స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా.. ఈ విషయాలు గమనించండి..!

Stock Market: స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా.. ఈ విషయాలు గమనించండి..!

Update: 2022-09-09 06:30 GMT

Stock Market: స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా.. ఈ విషయాలు గమనించండి..!

Stock Market: స్టాక్‌మార్కెట్ నుంచి డబ్బు సంపాదించడం అంత సులభం కాదు. దీనిపై చాలా అవగాహన అవసరం. అయితే చాలామంది కొంత ఆలోచనతో స్టాక్ మార్కెట్‌లో డబ్బును ఇన్వెస్ట్ చేస్తారు. కానీ అవగాహన లేకపోవడంతో కొంత నష్టపోవలసి ఉంటుంది. తర్వాత దీని నుంచి బయటికి వస్తారు. వాస్తవానికి స్టాక్‌ మార్కెట్‌లో డబ్బు సంపాదించాలంటే మార్కెట్‌లో ఉంటూ అవగాహన పెంచుకొని కొన్ని చిట్కలు పాటిస్తూ ఉండాలి. అప్పుడు కచ్చితంగా ఇందులో విజయం సాధిస్తారు. కొన్ని విషయాలని కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.

1. ఖర్చులు తగ్గించుకొని ఏమైనా డబ్బు మిగిలి ఉంటేనే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలి. మార్కెట్లో ఎక్కువ కాలం ఉంటే డబ్బు దానంతట అదే వస్తుంది.

2. రిటైల్, బ్యాంకింగ్ ఎప్పటికీ మూసివేయబడని రెండు రంగాలు. ఈ పరిస్థితిలో ఈ రెండు రంగాలకు సంబంధించిన మంచి కంపెనీలలో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం.

3. అదృష్టం కారణంగా స్టాక్ మార్కెట్ నుంచి డబ్బు సంపాదించగలిగితే దురదృష్టం వల్ల డబ్బును కోల్పోవచ్చు. అందుకే ఎప్పుడు అదృష్టంపై ఆధారపడకూడదు. స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడు ఏ పరిస్థితులు ఉంటాయో అంచనా వేయడం చాలా కష్టం.

4. ఎక్కువ రోజులు స్టాక్‌ మార్కెట్‌లో మెదిలినప్పుడే లాభాలు వస్తాయి. తక్కువ టైంలో డబ్బు సంపాదించాలి అనుకునేవారికి ఇది మంచి ఎంపిక కాదు. దీర్ఘకాలాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత మాత్రమే మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి. మీరు ఎంత ఎక్కువ కాలం ఉంటారో మీ లాభాల అవకాశాలు అంత ఎక్కువగా పెరుగుతాయని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News